intersting update from Chiranjeevi's sye raa movie చిరంజీవి ‘సైరా’లో స్టైలిష్ స్టార్ కూడా..!

Stylish star allu arjun to act in chiranjeevi s sye raa movie

sye raa, Narasimha reddy, Chiranjeevi, Ram Charan, amitabh bachchan, Allu Arjun, Voice over, Surender Reddy, allu arjun voice sye raa, movies, entertainment, tollywood

Allu Arjun is going to lend his voice for Ram Charan’s production venture Sye Raa Narasimha Reddy, in which Megastar Chiranjeevi is playing the lead role.

చిరంజీవి ‘సైరా’లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా..!

Posted: 11/20/2018 08:04 PM IST
Stylish star allu arjun to act in chiranjeevi s sye raa movie

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణ సారథ్యంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. తొలితరం స్వతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం పాఠకులకు తెలిసిందే. తొలినాళ్లలో అంగ్లేయులను ఉయ్యాలవాడ ఎలా ఎదుర్కోన్నారు. భరత మాతకు విముక్తి కల్పించేందుకు ఆయన చేసిన పోరాటాల నేపథ్యంలో తెరకెక్కుతన్న చిత్రమిది.

ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా భాగస్వామి కాబోతున్నాడట. గుణశేఖర్ వినతి మేరకు రాణి రుద్రమదేవి చిత్రంలో కూడా బన్ని అతిథిపాత్ర పోషించి ప్రేక్షకులను అకట్టుకున్నారు. ఔనా ఆయన ఏ పాత్రను పోషిస్తున్నారు. అన్న ప్రశ్నలు కూడా బన్ని అభిమానుల నుంచి వ్యక్తమవుతున్నాయి. అయితే అభిమానులకు ఇక్కడే ఓ ట్విస్టు వుంది. ఈ చిత్రంలో బన్ని నటించడం లేదు కానీ ఆయన గొంతును వాడబోతున్నారని సమాచారం.
 
సైరా నరసింహా రెడ్డి సినిమా వాయిస్ ఓవర్ తో ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. ఈ వాయిస్ ఓవర్ ను బన్నీతో చెప్పిస్తారని తెలుస్తోంది. స్టైలిష్ స్టార్ వాయిస్ ఓవర్ ఇస్తే సినిమాకు ప్లస్ అవుతుందని.. డైరెక్టర్ సురేందర్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. దీనికి బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో నయనతార, అమితాబ్ .. జగపతిబాబు .. సుదీప్ విజయ్ సేతుపతి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sye raa  Narasimha reddy  Chiranjeevi  Ram Charan  Allu Arjun  Surender Reddy  Tollywood  

Other Articles