Chitralahari Regular Shooting from Nov 12th బరిలోకి సాయిధరమ్ తేజ్ ‘చిత్రలహరి’

Sai dharam tej chitralahari regular shooting from nov 12th

Sai Dharam Tej's CHITRALAHARI movie launch, CHITRALAHARI, Sai Dharam Tej, Kalyani Priyadarshan, Devi Sri Prasad, Kishore Tirumala, Mythri Movie Makers, Kalyani Priyadarshan Sai Dharam Tej's CHITRALAHARI, movie launch, Mythri Movie, movies, entertainment, tollywood

Sai Dharam Tej is working with director Kishore Tirumala for a film titled Chitralahari. Mythri Movie Makers is bankrolling the film while top musician Devi Sri Prasad is composing music.

బరిలోకి సాయిధరమ్ తేజ్ ‘చిత్రలహరి’

Posted: 11/09/2018 03:59 PM IST
Sai dharam tej chitralahari regular shooting from nov 12th

విజయం కోసం ఎదురుచూస్తున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా తాజాగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్రలహరి'లో నటిస్తున్నారు. వరుసగా తనాు నటించిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఆశాజనకంగా ఫలితాలను రాబట్టకపోవడంతో.. ఆయన తన పూర్తి ఆశలు చిత్రలహరిపైనే పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రీ పోడ్రక్షన్ పనులలో చిత్ర యూనిట్, దర్శకుడు కిషోర్ తిరుమల బిజీగా వున్నారు.

ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. కల్యాణి ప్రియదర్శన్ తో పాటుగా నివేదా పేతురాజ్ కథానాయికలుగా కనిపించనున్నారు. అయితే ఈ చిత్రం ఈ నెల 12 నుంచి పట్టాలెక్కనుందని సమాచారం. 12 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ప్రారంభించనున్నారు. ఈ మేరకు చిత్రంలోని నటీనటులకు ఇప్పటికే సమాచారం అందించారు. ఏకధాటిగా 40 రోజులపాటు షూటింగ్ జరపనున్నారు.

ఈ షెడ్యూల్ లోనే దాదాపుగా 60 శాతం షూటింగును పూర్తిచేయనున్నారు. అమేరకు సినిమా దర్శకత్వ విభాగం ప్లాన్ చేసుకుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. కాగా, రోమాంటిక్ చిత్రాలకు తనదైన బాణీలను అందించి యువతను ఉర్రూతలూగించే దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఆయన సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలవనుందని అంటున్నారు. ఈ సినిమాతో తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో తేజు వున్నాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles