2.0 Theatrical Trailer: A New Experience రోబో 2.0: అద్బుతావిష్కరణకు ప్రతిరూపం..

2 0 theatrical trailer is a graphical extravaganza

Shankar, 2.0, Rajinikanth, Amy Jackson, Akshay Kumar, AR Rahman, 2.0 trailer, 2.0 trailer news, 2.0 trailer updates, 2.0 trailer latest, 2.0 trailer review, 2.0 trailer talk, Lyca Productions, movies, entertainment, tollywood

2.0 Theatrical Trailer is a Graphical Extravaganza: Sensational director Shankar's next film 2.0 trailer is a treat to watch.

రోబో 2.0: అద్బుతావిష్కరణకు ప్రతిరూపం..

Posted: 11/03/2018 04:27 PM IST
2 0 theatrical trailer is a graphical extravaganza

యావత్ సినీ ప్రేక్షకులు, దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న 2.ఓ అధికారిక ట్రైలర్ వచ్చేసింది. రజినీకాంత్, శంకర్ కాంబినేషన్లో సుమారు రూ. 543 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపోందించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ బాషల్లో తెరకెక్కనుంది. ఈ చిత్ర ట్రైలర్ ను దీపావళి పండుగ పర్వదినం కానుకగా.. గ్రాండ్ గా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రజనీకాంత్ తన చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.

ఇందుకోసం చెన్నైలోని సత్యం సినిమాస్ లో ఘనంగా ఈవెంట్ ను ప్లాన్ చేసిన చిత్ర నిర్మాణ వర్గాలు 4డీ సౌండ్‌ టెక్నాలజీతో ఈ ట్రైలర్ ను భారీ ఎత్తున విడుదల చేశారు. భారత సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి 4డీ సౌండ్‌ టెక్నాలజీ వాడటం ఇదే తొలిసారి. ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. అక్షయ్ కుమార్ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తున్నారు.

ఆస్కార్ విజేత ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది అటు దర్శకులు శంకర్ తో పాటు ఇటు నటుడు రజనీకాంత్ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. రోబో చిత్రం తరువాత వీరిద్దరికి కాంబినేషన్లో వస్తున్న చిత్రం.. అందులోనూ భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాలతో నిర్మించిన చిత్రంపై ఇద్దరి కెరీర్ అధారపడివుందన్న వార్తలు కూడా తెరపైకి వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 2.0 trailer  Shankar  Rajinikanth  Amy Jackson  AR Rahman  tollywood  

Other Articles