SS Rajamouli's multi starer on tracks soon త్వరలో పట్టాలెక్కనున్న #RRR, ముహూర్తం ఖారారు

Date locked for ntr ram charan s next ss rajamouli latest updates

NTR, Ram Charan, SS Rajamouli, DVV Danayya, Rajamouli next, Rajamouli new film, Rajamouli latest updates, Rajamouli new flick, Rajamouli movie muhurat, telugu films, teaser, trailers, syra, saaho, latest movie news, movies, entertainment, tollywood

Date locked for NTR - Ram Charan's next: SS Rajamouli is all set to start his next film and NTR, Ram Charan will play the lead roles.

త్వరలో పట్టాలెక్కనున్న #RRR, ముహూర్తం ఖారారు

Posted: 10/30/2018 07:50 PM IST
Date locked for ntr ram charan s next ss rajamouli latest updates

దర్శక దిగ్గజం రాజమౌళి బాహుబలి తరువాత చాల గ్యాప్ తీసుకుని రూపొందించనున్న మల్టీ స్టారర్ చిత్రం ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఆటు ఆయన అభిమానులతో పాటు ఇటు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మరోవైపు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ ఫ్యాన్స్ కూడా ఎంతో అసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అభిమానుల ఉత్కంఠకు ఎట్టకేలకు చిత్ర దర్శకుడు తెరదించారు. త్వరలోనే ఈ చిత్రం పట్టాలు ఎక్కనుందని టాక్ బయటకు వచ్చేసింది.

రాజమౌళి మల్టీస్టారర్ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికావడంతో, ఈ సినిమాను వచ్చే నెలలో పట్టాలెక్కించేందుకు దర్శక దిగ్గజం సిద్దమైయ్యారు. దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కారించుకుని నవంబర్ 5వ తేదీన చిత్రానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి లాంచ్ చేయాలనే రాజమౌళి నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు. డీవీవీ దానయ్య 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ - రాంచరణ్ కథానాయకులుగా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ టాక్ కూడా వినబడుతుంది. ఈ చిత్రంలో మొత్తం ముగ్గురు కథానాయికలు ఉంటారని సమాచారం. ఒక హీరోయిన్ గా ఫారిన్ బ్యూటీ కనిపించనుందని అంటున్నారు. మిగతా ఇద్దరు కథానాయికలు ఎవరనేది కూడా త్వరలో తెలియనుంది. హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సీన్స్ వుంటాయని అంటున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ కి సంబంధించిన సన్నివేశాన్ని 45 రోజుల పాటు చిత్రీకరించనున్నారట. దీనిని బట్టి ఆ సీన్ ఏ రేంజ్ లో ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SS Rajamouli  NTR  Ram Charan  DVV Danayya  tollywood  

Other Articles