trinadha rao nakkina to direct venkatesh మరో డైరెక్టర్ కు వెంకీ పచ్చజెండా..

Victory venkatesh gives nod to trinadha rao nakkina

venkatesh, trinadha rao nakkina, tollywood, f2, venky mama, multi starer, anil ravipudi, bobby, hello guru preme kosame, naga chaitanya, latest movie news, tollywood, movies, entertainment

Hero Victory Venkatesh is busy with consecutive movies, He is currently busy with F2 movie which is a multi-starer and the another with venky mama title too is a multistarer. And then he is to act in Trinadha rao Nakkina movie.

మరో డైరెక్టర్ కు వెంకీ పచ్చజెండా..

Posted: 10/24/2018 08:45 PM IST
Victory venkatesh gives nod to trinadha rao nakkina

హీరో విక్టరీ వెంకటేశ్ ప్రస్తుతం.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' అనే మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నారు. చిత్రీకరణ పరంగా ఇది ముగింపు దశకి చేరుకుంది. ఈ సినిమా తరువాత ఆయన బాబీ దర్శకత్వంలో 'వెంకీ మామా' అనే మరో మల్టీ స్టారర్ చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే వెంకటేశ్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ చిత్రపురిలో వినబడుతుంది. దర్శకుడు నక్కిన త్రినాథరావు దర్శకత్వంలోనూ ఓ చిత్రంలో నటించేందుకు పచ్చజెండా ఇచ్చేశాడు వెంకీ. నక్కిన త్రినాథరావు రూపొందించిన తాజా చిత్రం 'హలో గురు ప్రేమకోసమే' థియేటర్లలో వుంది. ఈ చిత్రం కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది. వసూళ్ల పరంగానూ పర్వాలేదు అనిపిస్తుంది.

యంగ్ హీరో రామ్ నటించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో హీరో వెంకటేష్ కూడా సై అన్నారని సమాచారం. అయితే ఈ చిత్రానికి సంబంధించి గతంలోనే వెంకటేశ్ కి కథ వినిపించారని సమాచారం. ఆ కథను చేయడానికి తాజాగా వెంకటేశ్ ఓకే చెప్పారు. కిరణ్ రెడ్డి.. భరత్ చౌదరి నిర్మాణ బాధ్యతలు వహించనున్న ఈ సినిమాకు సురేశ్ బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తారు. ఈ సినిమాలో కథానాయిక కోసం అన్వేషణ కొనసాగుతోంది. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : venkatesh  nakkina trinadha rao  f2  venky mama  multi starer  tollywood  

Other Articles