ఆంధ్రుల అభిమాన నటుడు, ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు అంటూ రెండు భాగాలుగా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మొదటిభాగమైన 'కథానాయకుడు'కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తూ వెళుతున్నారు. ఈ భాగంలో అక్కినేనిగా సుమంత్.. శ్రీదేవిగా రకుల్ కనిపించనున్నారు. ఇక జయప్రద పాత్రకోసం ఇటీవలే తమన్నాను ఎంపిక చేసుకున్నారు. తాజాగా ఆమె షూటింగులో కూడా పాల్గోంటున్నట్లు వార్తలు అందుతున్నాయి.
'అడవిరాముడు' .. 'సూపర్ మేన్' .. 'యమగోల' తదితర చిత్రాలు ఎన్టీఆర్ - జయప్రద కాంబినేషన్లో ఘన విజయాలను సాధించాయి. ఈ సినిమాలకి సంబంధించి ఎన్టీఆర్ బయోపిక్ లో ఒకటి రెండు సన్నివేశాలకు .. ఒక సూపర్ హిట్ సాంగ్ కు చోటుదక్కినట్టు చెబుతున్నారు. జయప్రద పాత్రలో తమన్నా ఎలా ఒదిగిపోనుందో .. ఏ సూపర్ హిట్ సాంగ్ కి స్టెప్స్ వేయనుందో తెలియాలంటూ సినిమా విడుదలయ్యే వరకు వేచిచూడాలి. కాగా, ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రనిర్మాణ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more