Dil Raju screens special show for allu arjun దిల్ రాజు స్పెషల్ షో అంతర్యమేమిటో.?

Dil raju screens special show for allu arjun

dil raju, allu arjun, vijay sethupathi, trisha, 96 telugu rights, 96 movie, kollywood 96 movie, latest movie news, new movie news, movies, entertainment, tollywood

Tollywood producer Dil Raju screens special show of movie 96 for allu arjun in hyderabad, who had purchased the telugu rights of the yet to release kollywood movie.

దిల్ రాజు, బన్నీల స్పెషల్ షో అంతర్యమేమిటో.?

Posted: 10/01/2018 05:23 PM IST
Dil raju screens special show for allu arjun

తమిళంలో విజయ్ సేతుపతి .. త్రిష జంటగా '96' సినిమా రూపొందింది. 1996 కాలంలో సాగే విభిన్నమైన ప్రేమకథ ఇది. ఈ నెల 4వ తేదీన ఈ సినిమా అక్కడ విడుదల కానుంది. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అక్కడ భారీ అంచనాలు వున్నాయి. ఈ కాన్సెప్ట్ ఆడియన్స్ కి కొత్తగా అనిపిస్తుందని అంటున్నారు. తెలుగులో ఈ సినిమా రీమేక్ హక్కులను పొందిన దిల్ రాజు.. వాటిని పొందేందుకు న్యాచురల్ స్టార్ నానీ ఒత్తిడి చేశారని ఇటీవల ఫీల్మ్ నగర్లో టాక్ కూడా వచ్చింది.

అది నుంచి విభిన్నమైన చిత్రాలను ఎంపిక చేసుకుంటున్న నాని.. 96 రిమేక్ లో కూడా తానే నటిస్తానని చెప్పాడని చిత్రపురికాలనీలో గుసగుసలు వినబడ్డాయి. అయితే ప్రస్తుత పరిణామాలు మాత్రం అందుకు అనుకూలంగా లేవా.? అన్న సందేహాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే నాని స్థానంలో అల్లు అర్జున్ ను తీసుకోవాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడా.? అన్న టాక్ వినబడుతుంది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. అదేంటంటే.. బన్నీ కోసం హైదరాబాద్ లో దిల్ రాజు స్పెషల్ షో వేశాడని సమాచారం.

ఎందుకిలా చేశాడన్న వార్తలు వస్తున్న క్రమంలో మరో టాక్ కూడా వినబడుతుంది. బన్నీతో ఈ సినిమాను రీమేక్ చేయాలనే ఉద్దేశం ఏమీ లేదనీ .. కంటెంట్ పట్ల బన్నీ అభిప్రాయం తెలుసుకోవడం కోసమే దిల్ రాజు అలా చేశాడని అంటున్నారు. మరి ఈ సినిమా చూసి దిల్ రాజుకి బన్నీ ఏం చెప్పాడనేది తెలియరాలేదు. ఈ సినిమాకి ఎవరు దర్శకత్వం వహించనున్నారు? ఎవరెవరు నటించనున్నారు ? అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dil raju  allu arjun  vijay sethupathi  trisha  96 movie  tollywood  

Other Articles