Venkatesh's Daughter To Marry Reddy పరిణయానికి సిద్దమైన వెంకటేష్ తనయ

Is venkatesh s daughter opting for love marriage

venkatesh daughter wedding | venkatesh daughter marriage | venkatesh daughter love marriage | venkatesh daughter ashritha marriage | venkatesh daughter | Venkatesh | ashritha daggubati marriage | ashritha daggubati | hyderabad race club chairman | grandson | movies, entertainment, tollywood

Aashritha Daggubati, elder daughter of hero Victory Venkatesh, is all set to tie the knot. Aashritha has been in love with the grandson of Hyderabad Race Club Chairman Surendar Reddy

ప్రేమ పరిణయానికి సిద్దమైన వెంకటేష్ తనయ`

Posted: 09/22/2018 04:49 PM IST
Is venkatesh s daughter opting for love marriage

‘ప్రేమ తో రా.. ప్రేమించుకుందాం రా.. పెళ్లి చేసుకుందాం.. ప్రేమింటే ఇదేరా.. కలిసుందాం రా..’ లాంటి ప్రేమ కథా చిత్రాలతో పాటు బ్రహ్మపుత్రుడు, ధర్మచక్రం, వంటి చిత్రాలతో విజయాలను అందుకుని విక్టరీని తన ఇంటి పేరుగా మార్చుకున్న హీరో వెంకటేష్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. విక్టరీ వెంకటేష్ సినిమాలు మాత్రమే తెలిసిన తెలుగు ప్రేక్షకులకు ఆయన కుటుంబం గురించి మాత్రం ఏమాత్రం తెలియదు.

ఆయన సోదరుడు దగ్గబాటి సురేష్ నిర్మాతగా, ఆయన తనయుడు రానా దగ్గుబాటి నటుడిగా తెలుగు ప్రేక్షకులకు తెలిసినా.. హీరో వెంకటేష్ రియల్ లైఫ్ గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవడానికి కారణం వారు సినీరంగంతో చాలా దూరంగా వ్యవహరించడమే. అయితే సినిమా ప్రభావం మాత్రం ఇప్పుడు వెంకటేష్ తనయపై పడిందనే చెప్పాలి. రీల్ లైఫ్ లో తన ప్రేమను విజయం చేయడానికి తాను పడిన కష్టం తన తనయ మాత్రం పడకూడదని నిర్ణయం తీసుకున్నారు విక్టరీ వెంకటేష్..

అందుకనే ఆయన తన కూతురు రియల్ లైఫ్ లవ్ కు పచ్చజెండా ఊఫారు. దీంతో త్వరలోనే విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత పెళ్లి పీట‌లెక్క‌బోతుంది. ఇంతకీ ఆశ్రీత ఎవరితో ప్రేమలో పడిందో తెలుసా.? బిగ్ షాట్ ఫ్యామిలిగా పేరొందిన  హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడితో అశ్రిత గత కొంతకాలంగా ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో పెద్దలు వివాహానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.

తాజాగా వెంకటేష్ అన్న సురేష్ బాబు.. సురేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి పెళ్లి ఖాయం చేసుకున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. అబ్బాయి తండ్రి రఘురామి రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మంచి స్నేహితుడు కావడంతో త్వరలో అశ్రిత నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగున్నాయట. అయితే ఈ ప్రేమ వివాహంపై సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ ఇరు కుటుంబం సభ్యులు ఎలాంటి స్పందన తెలియజేయలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Chiranjeevi s sye raa pre release event postponed

  చిరంజీవి ‘సైరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ మళ్లీ వాయిదా

  Sep 17 | తొలితరం తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి.. దర్శకుడు సురేందర్ రెడ్డి రూపోందిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రం వచ్చే నెల 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని విడుదల కానుంది.... Read more

 • Varun tej excelled in the role beyond expectations harish shankar

  వరుణ్ తేజ్ ‘వాల్మీకి’లో శ్రీదేవిలా పూజాహెగ్డే మెరుపులు

  Sep 17 | వరుణ్ తేజ్..  హరీష్ శంకర్ కాంబినేషన్‌లో 'వాల్మీకి' చిత్రం వస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య రిలీజైన టీజర్‌, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. గద్దలకొండ గణేష్‌కు జోడిగా శ్రీదేవిగా అలరించనుంది పూజా..... Read more

 • Chiranjeevi gives precious gift to amitabh bachchan

  బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు చిరంజీవి విలువైన కానుక

  Sep 17 | చిత్ర పరిశ్రమ అంటే సినిమాలు, పారితోషికాలు, వసూళ్లే కాదు.. నటీనటుల మధ్య మంచి స్నేహం కూడా ఉంటుంది. ఇద్దరు అగ్రహీరోల మధ్య అలాంటి స్నేహబంధం పెనవేసుకోవడం చిత్రపరిశ్రమకు, దానిపై ఆధారపడిన వారికి శుభసూచకమే. అందుకు... Read more

 • Comedy track highlights in nithin bheeshma movie

  నితిన్ ’భీష్మ‘ మూవీలో ఆ ట్రాక్ హైలైట్

  Sep 12 | వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ కథానాయకుడిగా 'భీష్మ' రూపొందుతోంది. రష్మిక మందన కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, హెబ్బా పటేల్ కీలకమైన పాత్రలో కనిపించనుంది. నెగెటివ్ షేడ్స్ తో కూడినదిగా ఆమె పాత్ర కనిపించనుందని... Read more

 • Issues erupt in maa again naresh issued showcause

  ‘మా’లో విభేదాలు.. నరేశ్ తప్పుకోవాల్సిందే..

  Sep 12 | మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో విభేదాలు తారస్థాయికి చేరాయి. అధ్యక్షుడు నరేశ్, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు రాజశేఖర్ ల మధ్య స్నేహం దెబ్బతినగా, రాజశేఖర్ వర్గం తీవ్రంగా స్పందించింది. నరేశ్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలంటూ... Read more

Today on Telugu Wishesh