Chiranjeevi visits the sets of Ram Charan రాంచరణ్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన మెగాస్టార్..

Megastar chiranjeevi pays a surprise visit to ram charan on the sets

chiranjeevi, ram charan, director boyapati srinu, Upasana, Kiara Advani, rc12, sye raa, Azerbaijan, Georgia, ram charan 12, chiranjeevi rc 12, sye raa narasimha reddy, upasana kamineni instagram pics, upasana kamineni, tollywood, movies, entertainment

Megastar Chiranjeevi made a surprise visit on the sets to meet his son Ram Charan. Upasana shared a picture of her with Chiranjeevi and Ram Charan. The picture sees them dressed in all-black.

రాంచరణ్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన మెగాస్టార్..

Posted: 09/21/2018 07:24 PM IST
Megastar chiranjeevi pays a surprise visit to ram charan on the sets

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ యూరప్‌లోని అజర్‌బైజాన్‌లో జరుగుతోంది. రామ్‌చరణ్‌, సతీమణి ఉపాసన ప్రస్తుతం అజర్‌బైజాన్‌లో ఉన్నారు. అయితే గురువారం చరణ్‌ సినిమా సెట్స్‌కు మెగాస్టార్‌ చిరంజీవి వచ్చి అందరినీ సర్‌ప్రైజ్‌ చేశారట. ఈ విషయాన్ని ఉపాసన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

‘మామయ్యతో డిన్నర్‌. అందరం నలుపు రంగు దుస్తులు ధరించాం. జార్జియా వెళ్లడానికి ముందు మెగాస్టార్‌.. రామ్‌చరణ్‌ సెట్స్‌కు వచ్చారు’ అని క్యాప్షన్‌ ఇస్తూ అందరూ కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా కియారా అడ్వాణీ నటిస్తున్నారు. ఇందులో ఆర్యన్‌ రాజేశ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో చెర్రీ కొత్తగా కన్పించనున్నట్లు తెలుస్తోంది.

ఇందుకోసం చెర్రీ భారీగా వర్కవుట్స్‌ చేసి తన పాత్రకు తగ్గట్టుగా శరీరాకృతిని మార్చుకున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో ప్రముఖ ఫైట్‌ మాస్టర్‌ కనల్‌ కణ్ణన్‌ నేతృత్వంలో భారీ పోరాట సన్నివేశాలు తెరకెక్కించారు. ఈ సన్నివేశాల్లో చరణ్‌తో పాటు ఆర్యన్‌ రాజేశ్‌, ముఖేశ్‌ రిషి కూడా పాల్గొన్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chiranjeevi  ram charan  Upasana  Kiara Advani  rc12  sye raa  Azerbaijan  Georgia  tollywood  

Other Articles