Kangana's Manikarnika In BIG TROUBLE మణికర్ణిక చిత్ర ప్రాజెక్టు నుంచి మరోకరు ఔట్.?

Kangana ranaut s manikarnika in big trouble producer quits project

Kangana ranaut manikarnaika, manikarnaika Motion Teaser, Irfan Khan, Ankita Lokhande, manikarnika budget, manikarnika reshoot, manikarnika, kangana ranaut, manikarnika producer fired, kangana ranaut sonu sood, budget, reshoot, producer, sonu sood, movies, entertainment, bollywood

Kangana Ranaut starrer Manikarnika has been making news for all the wrong reasons. Now the business head of Zee Studios, Mr. Sujay Kutty, has been sacked from the company, as he had given the green signal previously for the film to go on floors.

మణికర్ణిక: ది క్వీన్ అఫ్ ఝాన్సీ.. మోషన్ టీజర్ విడుదల..

Posted: 09/10/2018 07:46 PM IST
Kangana ranaut s manikarnika in big trouble producer quits project

కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారిగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన 'మణికర్ణిక' సినిమాకు ఒకదాని తర్వాత మరొక ఇబ్బంది వచ్చి పడుతూనే ఉంది. ఈ సినిమా ఝాన్సీ రాణి లక్ష్మీబాయి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందించటం మరో విశేషం. ఈ సినిమా షూటింగ్ కొంతకాలం బాగానే నడిచింది. ఈ సినిమాకు మొదట డైరెక్టర్ గా వ్యవహరించిన క్రిష్ జాగర్లమూడి ప్రాజక్ట్ నుంచి తప్పుకోవడంతో ఇబ్బందులు మొదలయ్యాయి.

బాలకృష్ణ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ బాధ్యతలు క్రిష్ చేపట్టడంతో ‘మణికర్ణిక’పై దృష్టి సారించలేక ఆయన ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. చేసేదేమీలేక ఈ సినిమా దర్శకత్వ బాధ్యతను కంగన స్వయంగా చేపట్టింది. దీంతో ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాల్సిన సోనూసూద్ కంగన తీరు నచ్చక తప్పుకున్నారు.

ఇక తాజాగా ఏకంగా ఈ సినిమా నిర్మాత సంజయ్ కుట్టి కూడా బాధ్యతల నుంచి తప్పుకున్నట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం. దీనికి కారణం షూటింగ్ లేట్ కావడమేనట. దీంతో బడ్జెట్ బాగా పెరిగిపోయిందని సమాచారం. రూ.70 కోట్లతో అయిపోతుందనుకున్న నిర్మాణ వ్యయం రూ.100 కోట్లకు చేరుకునేలా ఉందట. దీంతో సంజయ్ తప్పుకున్నట్టు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాను కొత్త నిర్మాతలు తీసుకున్నారని తెలుస్తోంది. ఇదే సమయంలో చిత్ర యూనిట్ తమ మోషన్ టీజర్ ను కూడా విడుదల చేసింది. దాదాపుగా మూడు నిమిషాలకు పైగా నిడివిగల ఈ టీజర్ లో చిత్రనిర్మాణంలో తీసిన ఫోటోలతో కూడిన అల్బమ్ మాదిరిగా వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kangana ranaut  manikarnaika  Motion Teaser  Irfan Khan  Ankita Lokhande  producer  sonu sood  bollywood  

Other Articles