A Sneak Peak of NOTA తనదైన ప్రచారానికి తెరలేపిన విజయ్ దేవరకొండ

Nota sneak peek vijay devarakonda surprises as a politician

NOTA, Sneak Peek Vijay devarakonda, Sathyaraj, Nasser, Mehreene pirzada, M.S. Bhaskar, Priyadarshi, Anand Shankar, Sam C.S. movies, entertainment, tollywood

Vijay Deverakonda is the most happening actor in Telugu, Even without foraying into other industries, he has a loyal fan following in the neighbouring states, who will be making his debut in Tamil with a political drama titled NOTA.

ఈ హీరో రౌడీనా.? రాజకీయ నేతా.? లీడరా.?

Posted: 09/05/2018 08:11 PM IST
Nota sneak peek vijay devarakonda surprises as a politician

సినిమా ప్రచారాలు చేయడంలో యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండది అందె వేసిన చెయ్యి. తన సినిమాలకు సంబంధించి ఒక పోస్టర్‌ కానీ, ట్రైలర్‌ కానీ విడుదల చేయాలంటే ఆసక్తికరమైన ట్వీట్లు, సందేశాలు పెడుతుంటారు. తాజాగా విజయ్‌ తాను కథానాయకుడిగా నటిస్తున్న ‘నోటా’ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన ట్వీట్‌ను పెట్టారు. గురువారం సాయంత్రం ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల కాబోతున్న సందర్భంగా పోలింగ్‌ నిర్వహించారు.

అందులో విజయ్‌ దేవరకొండ ఎవరు? a)రౌడీ b)రాజకీయవేత్త c)లీడర్ d)నోటా అని ఆప్షన్లు ఇచ్చారు. ఇప్పటివరకు దాదాపు 4000 మందికిపైగా ఓటింగ్‌ చేశారు. ఈ పోల్‌ రేపటివరకు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. సినిమాను ఇలా వినూత్నంగా ప్రచారం చేస్తున్నందుకు విజయ్‌ను నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ‘సినిమా ప్రచార కార్యక్రమాలు నీకంటే బాగా ఎవ్వరూ చేయలేరు భయ్యా’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

‘గీత గోవిందం’ చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకున్న విజయ్‌ ప్రస్తుతం ‘నోటా’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇందులో ఆయన రాజకీయ నాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఆనంద్‌ శంకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విజయ్‌కు జోడీగా మెహరీన్‌ నటిస్తున్నారు. అక్టోబర్‌ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో పాటు విజయ్‌ ‘ట్యాక్సీవాలా’ చిత్రంతోనూ బిజీగా ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NOTA  Sneak Peek Vijay devarakonda  Sathyaraj  Nasser  Mehreene  Anand Shankar  tollywood  

Other Articles

Today on Telugu Wishesh