మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నటించిన గ్రామీణ నేపథ్యంలోని చిత్రం రంగస్థలం తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక రికార్డులను తిరగరాసింది. దీంతో తన రెండో చిత్రం కోసం అప్పుడే సాధన చేస్తున్న రామ్ చరణ్.. డైట్ విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటిస్తున్నాడు. ఇదలావుండగా తన భర్తతో పాటు యూరోప్ కు వెళ్లిన ఉపాసన అక్కడి నుంచి జిమ్ లో వ్యాయామం చేస్తున్న ఓ ఫోటోను పంపుతూ తన మిస్టర్ సి అతి కష్టమైన వ్యక్తిగత ట్రైనర్ అని పేర్కోన్నారు.
ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చెబుతూ.. వ్యాయామం చేస్తున్న వీడియోను షేర్ చేశారు. ‘గత రాత్రి బాగా తిన్నందుకు ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నా. రామ్‌చరణ్ అతి కష్టమైన వ్యక్తిగత ట్రైనర్’ అంటూ ‘పాపం నేను’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. అంతటితో అగకుండా మెగాపవర్ స్టార్ కు ఉత్తమ నటుడి అవార్డును కూడా ఇవ్వోచ్చని సిఫార్సు చేశారు. అదేంటి అమె ఎందుకిలా వ్యాఖ్యలు చేసింది అనుకుంటున్నారా.?
యూరోప్ లో వీరిద్దరు ఓ డిష్ ను ఆర్డర్ ఇచ్చారు. అయితే చెర్రీ దానిపై ఓ లిక్విడ్ వేస్తూ తెగ తినేవారిలా హంగామా చేశారు. ఆయన యాక్షన్ చూసిన ఉపాసన అవార్డు ఇవ్వొచ్చని, డ్రామా చేస్తున్నాడని.. కనీసం రుచి కూడా చూడలేదని అన్నారు. చెర్రీ తన 12వ సినిమాకు సిద్ధమౌతున్నారని కూడా ఆమె చెప్పారు. బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కైరా అడ్వాణీ కథానాయిక. ఈ సినిమా షెడ్యూల్ మంగళవారం యూరప్‌లో ప్రారంభమైందని చిత్ర బృందం పేర్కొంది. రామ్‌చరణ్, వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్ తదితరులు ఈ షెడ్యూల్‌లో పాల్గొననున్నట్లు తెలిపారు. 25 రోజులు యూరప్‌లోనే షూటింగ్ జరగనుందని సమాచారం.
#RamCharan making dessert for @upasanakonidela
How cute husband he is
(And get your daily news straight to your inbox)
Feb 14 | వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ‘ఎన్టీఆర్’ ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమా ప్రకటన చేసిన రోజు నుంచే ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా... Read more
Feb 14 | అక్కినేని నాగచైతన్య, సమంత కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘మజిలీ’. ‘దేర్ ఈజ్ లవ్దేర్ ఈజ్ పెయిన్’ అనేది క్యాప్షన్. పెళ్లయిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం కావడంతో ‘మజిలీ’పై భారీ... Read more
Feb 13 | దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌కు కొద్ది రోజులు బ్రేక్ పడిందట. ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ... Read more
Feb 13 | యువ కథానాయకుడు నవీన్ చంద్ర తనకి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అయితే ఇంతవరకూ ఆయనకి సరైన హిట్ పడలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆయన జీఎస్ కార్తీక్ దర్శకత్వంలో... Read more
Feb 13 | సినీ పరిశ్రమలో స్టార్ గా ఎదగాలంటే ఎంత కష్టమో.. దానిని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం. అందుకనే హీరోలు.. తమకు దర్శకులు చెప్పిన కథలలో పలు మార్పులు చేయమని సూచిస్తుంటారు. ఆ తరువాతే వారి... Read more