SC quashes FIR against Priya Prakash Varrier కన్నుగీటిన ప్రియా ప్రకాష్ చిత్రానికి లైన్ క్లియర్..

Sc cancels criminal proceedings against malayalam actor priya prakash varrier

Priya Prakash Varrier, Priya Prakash Varrier Case, Supreme Court (SC), Oru Adaar Love, Hyderabad minorities, malayalam actor, mollywood, movies, entertainment

Malayalam actor Priya Prakash Varrier was granted a huge reprieve today as the Supreme Court cancelled a police case against her over a song in her upcoming movie "Oru Adaar Love".

కన్నుగీటిన ప్రియా ప్రకాష్ చిత్రానికి లైన్ క్లియర్..

Posted: 08/31/2018 08:09 PM IST
Sc cancels criminal proceedings against malayalam actor priya prakash varrier

‘ఒరు అదార్‌ లవ్’ చిత్రంలో కథనాయికగా నటించిన ప్రముఖ మలయాళ నటి ప్రియా ప్రకాశ్‌ వారియర్ యూట్యాబ్ స్టార్ గా వెలుగొందడంతో పాటు దేశవ్యాప్తంగా కుర్రకారు మనసుల్ని దోచేసింది. అమె ఓరగా చూస్తూ కన్నుగీటడం.. నెట్టింట్లో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అయితే తమ మనోభావాలను కించపరిచేలా పాటలు ఉన్నాయంటూ తెలంగాణకు చెందిన కొందరు ముస్లింలు కేసు వేసిన సంగతి తెలిసిందే.

దాదాపు నాలుగు నెలల పాటు విచారణలో ఉన్న ఈ కేసు ఇవాళ్టితో ఓ కొలిక్కి వచ్చింది. ప్రియ వారియర్ కు ఊరట లభించింది. అమె నటించిన చిత్రం విడుదలకు కూడా లైన్ క్లియర్ అయ్యింది. ప్రియపై వేసిన కేసును కొట్టివేస్తూ శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం సుప్రింకోర్టు తీర్పువెలువరించింది. ‘ఒరు అదార్ లవ్’ చిత్రంలోని ‘మాణిక్య మలరయ’ పాటలో ప్రియ కన్నుగీటడంపై దాఖలైన కేసులపై సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా అగ్రహం వ్యక్తం చేశారు.

ఈ పాట కేరళకు చెందిన ముస్లిం సంప్రదాయపు గీతం అని, ఇందులో ప్రియ కన్నుకొట్టడం అసభ్యకరంగా ఉందంటూ పలువురు ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఈ కేసుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా మాట్లాడుతూ..‘ఎవరో సినిమాలో ఏదో పాట పాడితే మీకు కేసు వేయడం తప్ప మరో పనేం లేదా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒమర్‌ లులు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అబ్దుల్‌ రహూఫ్‌ కథానాయకుడిగా నటించారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Naveen polishetty opts for a quirky comedy after latest hit

  వరుస హిట్లతో ఫుల్ జోష్ లో యంగ్ హీరో

  Jul 16 | నవీన్ పోలిశెట్టి హీరోగా ఇటీవల వచ్చిన 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' ప్రేక్షకుల ఆదరణ పొందింది. కామెడీని .. ఎమోషన్ ను కలిపి పండించే పాత్రలో నవీన్ మంచి మార్కులు కొట్టేశాడు. ఈ సినిమా విజయవంతం... Read more

 • Sahoo postponed who gets affected

  ప్రభాస్ అభిమానులకు చేధువార్త.. సాహో విడుదలలో..!

  Jul 16 | ‘బాహుబలి’ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ‘సాహో’. నేటితో ఈ సినిమాకు చిత్రబ‌ృందం గుమ్మడికాయ కొట్టేసింది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను... Read more

 • Jagapathi babu not part of mahesh babu s sarileru neekevvaru

  మహేష్ బాబుకు జగపతి బాబు షాక్.!

  Jul 16 | సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విజయశాంతి, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు వంటి పలువురు సీనియర్ స్టార్లు కూడా నటిస్తుండటంతో..... Read more

 • Natural star nani gang leader movie 1st look looks quite interesting

  ‘గ్యాంగ్ లీడ‌ర్’ ఫ‌స్ట్ లుక్..

  Jul 15 | నాని గ్యాంగ్ లీడ‌ర్ ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. జెర్సీ లాంటి సినిమా త‌ర్వాత ఈయ‌న చేస్తున్న సినిమా ఇది. తాజాగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. ఇందులో నాని ఐదుగురు ఆడ‌వాళ్ల‌తో క‌లిసి... Read more

 • Chiranjeevi s surprise for aishwarya rajesh

  మెగాస్టార్ ఫోన్.. ఉబ్బితబ్బిబవుతున్న హీరోయిన్

  Jun 18 | మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటించిన కౌసల్య కృష్ణమూర్తి ట్రైయిలర్ విడుదలైంది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య రాజేశ్ ఓ క్రికెటర్... Read more

Today on Telugu Wishesh