Vyjayanti movies releases Devadas Teaser వరలక్ష్మీ వత్రం రోజున.. దేవదాసు.. టీజర్ వచ్చేసింది..

Vyjayanti movies releases devadas teaser

Devadas teaser,Devadas trailer,Devadas small peg,Akkineni Nagarjuna,Rashmika Mandanna,nani devadas new movie,nani devadas movie trailer,devadas telugu trailer,nani devadas trailer 2018,devadas new movie trailer,nani upcoming movie trailer devadas,DevaDasMovieTEASER,Sriram Adittya,latest telugu movie trailer 2018,devadas official trailer,Vyjayanthi Movies,DD trailer,nani new movie devdas trailer, movies, entertainment, tollywood

King Nagarjuna and Natural Star Nani are all set to entertain the audience with a comic entertainer DevaDas. Sriram Aditya is the director and the first teaser of the film has been out today.

దాసు.. ఏంటి సంగతి అడిగేసిన దేవ.. టీజర్ వచ్చేసింది..

Posted: 08/24/2018 08:32 PM IST
Vyjayanti movies releases devadas teaser

డాన్ తో, డాక్టర్ కి ఎలా స్నేహం కుదురుతుందబ్బా? కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని పాత్రల గురించి వివరాలు బయటకు వచ్చిన వెంటనే ప్రేక్షకుల్లో మొలకెత్తిన సందేహం! ముందులే (మెడిసిన్) కాదు మందు (మద్యం) కూడా మనుషులను దగ్గరకు చేరుస్తుంది. బాధలను పంచుకునేలా చేస్తుంది. పరిచయాన్ని స్నేహంగా మారుస్తుంది అని చెప్పకనే చెప్పారు ‘దేవదాస్‌’ చిత్ర దర్శకుడు శ్రీరామ్ అదిత్య. ఇదే సందేహానికి తొలి టీజర్ రూపంలో సమాధానమిచ్చాడు.

చీప్‌ లిక్కర్‌ అనుకోండి… నాటు సారా అనుకోండి… కాస్ట్‌లీ స్కాచ్‌ అనుకోండి… అలవాటు వుండాలే గానీ, మనుషులను దగ్గర చేయని మందు లేదు. అదే డాన్ ని, డాక్టర్ ని దగ్గర చేసింది. నాగార్జున గ్లాసులో మందు పోశాడు. ‘సోడా కావాలా? వాటర్‌ కావాలా?’ అని అడిగాడు. ఈలోపు నాని రా తాగేశాడు. మరలా గ్లాసులో మందు పోశాడు. నాని మరలా తాగేశాడు. పెగ్గు మీద పెగ్గు కొట్టాడు. ‘దాసు… ఏంటి సంగతి?’ అని అడిగాడు దేవ! టీజర్ లో ఇంతే వుంది.

డైలాగులూ తక్కువే. కానీ, సన్నివేశం వినోదాత్మకంగా తెరకెక్కింది. దానికి కారణం… నాగార్జున, నాని నటనే! చిత్రంలోనూ ఇదేస్థాయిలో వీళ్లిద్దరి కెమిస్ట్రీ వుంటుందని వూహించవచ్చు. ఆకాంక్షా సింగ్‌, రష్మిక మందన్న కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 27న విడుదల చేయనున్నట్టు టీజర్ లో స్పష్టం చేశారు. వైజయంతి మూవీస్‌ ఈ చిత్రాన్ని నిర్మించింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Devadas  Nagarjuna  Nani  Rashmika Mandana  Vyjayanti movies  Sriram Aditya  ManiSharma  tollywood  

Other Articles