Geetha Govindam Day 5 Collections రూ.50 కోట్ల క్లబ్ లో చేరిన గీత గోవిందం

Geetha govindam 5 days box office collections report

Vijay Deverakonda, Parasuram, Satyameva Jayate,Rashmika Mandanna,Gold,geetha govindam,box-office, movies, entertainment, tollywood

Vijay Deverakonda has struck gold at the box-office once again, and his latest film Geetha Govindam is a run-away hit. But what has been more impressive is the way the fiy the film, directed by Parasuram.

రూ.50 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన ‘‘గీత గోవిందం’’

Posted: 08/20/2018 08:41 PM IST
Geetha govindam 5 days box office collections report

గీతా అర్ట్స్ నిర్మాణ సారథ్యంలో రూపోందిన చిత్రం గీతా గోవిందం మంచి హిట్ ను అందుకుంది. ఈ మధ్య కాలంలో యూత్ ను విపరీతంగా, విశేషంగా ఆకట్టుకున్న చిత్రంగా నిలిచిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, ఈ నెల 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తొలిరోజునే 16.40 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి, ఈ ఏడాదిలో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన టాప్ టెన్ చిత్రాల జాబితాలో చోటు సంపాదించుకుంది.

రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో తన జోరు చూపిస్తోంది. తొలి 5 రోజుల్లో ఈ సినిమా 55 కోట్ల గ్రాస్ ను .. 31కోట్ల షేర్ ను సాధించింది. చాలా తక్కువ సమయంలోనే ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లోకి చేరుకోవడం పట్ల అంతా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫుల్ రన్ లో ఈ సినిమా అరుదైన రికార్డును సాధించే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. యూత్ కి కావలసిన అంశాలు పుష్కలంగా ఉండటం వల్లనే థియేటర్ల దగ్గర జాతర వాతావరణం కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Deverakonda  Parasuram  Rashmika Mandanna  geetha govindam  box-office  tollywood  

Other Articles