Mahesh Babu 25th movie Maharshi Teaser released మహేష్ 25వ చిత్రం మహర్షి టీజర్.. చూశారా..

Mahesh babu 25th movie maharshi teaser released

Meet Rishi, Maharshi Teaser, Maharshi, Mahesh Babu Maharshi, Mahesh Babu Maharshi Teaser, Mahesh Babu Maharshi Official Teaser, Mahesh Babu Maharshi Trailer, Mahesh Trailer, Maharshi Trailer, Maharshi SSMB25, SSMB 25 First Look, SSMB 25 teaser, SSMB Official Teaser, Mahesh Babu 25th Film, Vamshi Paidipally, Maharshi First Look Teaser, Mahesh 25 Teaser, Devi Sri Prasad, Pooja Hegde, Mahesh Babu, tollywood, movies, entertainment

Maharshi is an upcoming Telugu film, featuring Superstar Mahesh Babu in the lead role. The unit releases the teaser of the film shows Mahesh Babu donning a role of a College student.

ప్రిన్స్ 25వ చిత్రం.. ఈ విద్యార్థి మాత్రం తుంటరోడే..

Posted: 08/09/2018 04:24 PM IST
Mahesh babu 25th movie maharshi teaser released

టాలీవుడ్ ప్రిన్స్ గా ఎందరో యువతుల గుండెల్లో ఎడతెగని కాకరేపుతున్న హీరో మహేశ్ బాబు.. మరో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రారాజుకు గ్రీటింగ్స్ వెల్లివిరుస్తున్నాయి. కాగా, చూస్తుండగానే ఆయన దాదాపుగా 25వ చిత్రంలో నటించేస్తున్నారు. ఆయన నటించిన చిత్రాలన్నీ దాదాపుగా సూపర్ హిట్ కావడం తెలిసిందే. అయితే ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం 'మహర్షి' ఆయనకు 25వ చిత్రం కానుంది. ఈ చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతుంది.

ప్రిన్స్ జన్మదినోత్సవ సందర్భంగా మహర్షి చిత్ర యూనిట్.. మహేష్ బాబు 25వ చిత్రానికి సంబంధించిన పస్ట్ లుక్ సహా టీజర్ కూడా విడుదల చేసింది. ఆయన ఫస్ట్ లుక్ కు వచ్చిన స్పందనే అటు టీజర్ కూడా లభించింది. ఈ టీజర్ లో మహేష్ బాబు కాలేజ్ స్టూడెంట్ గా కొత్త లుక్ తో కనిపిస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించాడు. ఈ టీజర్ ను విడుదల చేసిన గంటల వ్యవధిల్లోనే దాదాపు పది లక్షల మంది (మిలియన్) డిజిటల్ వ్యూస్ ను క్రాస్ చేసేసింది. దీనిని బట్టి ఈ సినిమా పట్ల అంతా ఎంత ఆసక్తితో ఉన్నారనే విషయం అర్థమవుతోంది.

ఇక టీజర్ లో మహేశ్ బాబు ఒకింత తుంటరి చేష్టల విద్యార్ధిగానే కనిపిస్తున్నాడు. తన ముందు వెళ్లే అమ్మాయిలను సూటిగా వారి కళ్లలోకి గుచ్చి చూస్తున్నాడు. అయితే ఈ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గాను .. రైతుబిడ్డగాను మహేశ్ బాబు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. పూజా హెగ్డే గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని అంటున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందని చెబుతున్నారు. మొత్తానికి మహేశ్ లుక్ .. టీజర్ అంతా 'మహర్షి' గురించి మాట్లాడుకునేలా చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.      

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles