పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం కొంత కాలంగా సినిమాలకు దూరంగా వుంటూ రాష్ట్ర ప్రజలకు ఎంతో కొంత సేవచేయాలని, తమ కుటుంబాన్ని అమితంగా అదరించిన ప్రేక్షకులకు సేవ చేసే క్రమంలోనే ఆయన రాజకీయ అరంగ్రేటం కూడా చేశారన్న విషయం తెలిసిందే. దీంతో జనసేన పార్టీని స్థాపించి గత ఎన్నికలలో టీడీపీ. బీజేపిలకు మద్దతు పలికిన ఆయన ఈ పర్యాయం రానున్న ఎన్నికలలో ప్రత్యక్షంగా పోరాడేందుకు సన్నధమయ్యారు. ఈ తరుణంలో ఆయన అప్పట్నించీ అంటే అంటూ ఓ నటి చేసిన వ్యాఖ్యలు అసక్తిని రేపాయి.
పవన్ కల్యాణ్ తో కేవలం ఒక్క చిత్రంలోనే నటించిన ఆమె ఆయన దాదాపుగా ఇరవే ఏళ్ల నుంచి అంతే అంటూ వ్యాఖ్యాలు చేసింది. ఇంతకీ అమె ఎవరు అనేగా అమె పేరు వాసుకీ. మెగా కుటుంబ నటవారసుడిగా అప్పటి వరకు తెలిసినా.. ఆ చిత్రంలో ఓ సగటు మధ్యతరగతి యువకుడిగా.. గొప్పింటి పిల్లను ప్రేమించి.. ఆ విషయాన్ని చెప్పలేక.. తనలోనే దాచుకున్న హీరో పడే అవేదన.. ఇదే క్రమంలో తన కుటుంబంలో వున్న అనురాగ, ఆప్యాయతలకు కూడా బంధీ కావడం.. దర్శకుడు కరుణాకరణ్ దర్శకత్వానికి నూరు మార్కులు వేస్తే.. పవన్ కల్యాణ్ ను పవర్ స్టార్ గా మార్చిన 'తొలిప్రేమ' చిత్రం ఇప్పటికీ అందరికీ గుర్తిండే వుంటుంది. అది పవర్ స్టార్ పవన్ కల్యాన్ సినీకెరీర్ లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రం.
ఆ సినిమాలో పవన్ నటనతో పాటు చాలా క్యారెక్టర్లు అభిమానులకు గుర్తుండిపోయాయి. అందులో ఒకటి పవన్ చెల్లెలి పాత్ర. ఆ పాత్రలో తమిళ నటి వాసుకి నటించింది. అప్పట్లో పవన్ తమ ప్రేమ విషయాన్ని కనిపెట్టారట. ఈ చిత్రం అర్ట్ డైరెక్టర్ గా ఆనంద్ సాయిని అమె ప్రేమించి.. పెళ్లి చేసుకుంది. అయితే ఈ చిత్ర షూటింగ్ సమయంలో తమ ప్రేమను పవన్ పసిగట్టారని చెప్పింది. అంతేకాదు.. తనకు పవన్ తో వున్న సన్నిహిత్యంతో షూటింగ్ ఖాళీ సమయంలో తాను ఆయన వద్దకు వెళ్లి కూర్చేనేద్దానని చెప్పింది.
అప్పుడు పవన్ కల్యాణ్ ఎదో ఫిలాసఫీ చెప్పేవారని.. దేశంలో కొందరికే ఇలా ఎందుకు..? మరికోందరికి అలా ఎందుకు..? దేవుడి వద్ద మనుషులందరూ సమానం.. కానీ దేవుడికే మనుషులు సమానం కాదా.? ఎందుకీ వత్యాసాలంటూ పవన్ ప్రశ్నించేవారని.. వాసుకీ గుర్తు చేసుకుంది. అయితే 'తొలిప్రేమ' సినిమా సమయానికి తన వయసు 18 ఏళ్లు మాత్రమే కావడంతో పవన్ చెప్పే వేదాంతం పెద్దగా తన బ్రెయిన్ కు ఎక్కేది కాదని కానీ ఇప్పుడు ఆయన చెప్పిన విషయాలు గుర్తుకు వస్తున్నాయంటూ చెప్పుకొచ్చింది వాసుకి.
(And get your daily news straight to your inbox)
Feb 21 | న్యాచురల్ హీరోగా నాని వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. త్వరలోనే 'జెర్సీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆయన, తదుపరి సినిమాను విక్రమ్ కుమార్ తో చేస్తున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ... Read more
Feb 21 | బాలీవుడ్ లో త్వరలో విడుదల కాబోతున్న అక్షయ్ కుమార్..‘కేసరి’ మూవీకి సంబంధించిన ట్రైయిలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో యుద్దం నేపథ్యంలో సాగనుంది. దేశభక్తిని.. జవాన్ల వీరోచితాన్ని.. సమస్యలను ఎదురోడ్డి... Read more
Feb 21 | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం వాల్మీకి. మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడు హరీశ్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ఇవాళే పట్టాలెక్కేసింది. ఇవాళ... Read more
Feb 21 | బాలీవుడ్ ప్రముఖ నిర్మాత.. రాజశ్రీ ప్రొడక్షన్స్ అధినేత.. రాజ్ కుమార్ బర్జాత్యా కన్నుమూసారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబాయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూసినట్టు ముంబై సినీ వర్గాలు... Read more
Feb 20 | ప్రముఖ తెలుగు నటుడు నాగబాబు మరోసారి తన యూట్యూబ్ చానల్.. ‘మై ఛానెల్ నా ఇష్టం’ ద్వారా కొంత మందిని టార్గెట్ చేస్తూ మరో స్కిట్‌ని వదిలారు. మెగా బ్రదర్ గా గుర్తింపు సాధించిన... Read more