Shailaja Reddy Alludu Official Teaser పిల్లే ఇలా ఉంటే.. ఈవిడ తల్లి ఎలా ఉంటుందో?

Shailaja reddy alludu official teaser

Shailaja Reddy Alludu, official teaser, Naga Chaitanya, Anu Emmanuel, Ramya Krishna, Maruthi, Sithara Entertainments, movies, entertainment, tollywood

Sithara Entertainments Presents the official Teaser of Shailaja Reddy Alludu featuring Naga Chaitanya, Anu Emmanuel and Ramya Krishnan. Directed by Maruthi Dasari and Music composed by Gopi Sundar.

పిల్లే ఇలా ఉంటే.. ఈవిడ తల్లి ఎలా ఉంటుందో?

Posted: 08/01/2018 08:41 PM IST
Shailaja reddy alludu official teaser

‘ఈ పిల్లే ఇలా ఉంటే.. ఈవిడ తల్లి ఎలా ఉంటుందో?’ అంటూ తన పరిస్థితిని తలచుకుంటున్నాడు అక్కినేని నటవారసుడు నాగచైతన్య. నిజమండీ.. ఇలా అయన అన్నాడో లేదు.. మన రఘుబాబు కూడా పిల్ల పిట్టలా ఇంతేవున్నా.. పొట్టంతా ఇగోనే అంటూ కామెంట్ చేశాడు. ఇదేంటి ఇలా.. అనుకుంటున్నారా.. నాగచైతన్య హిరోగా నటిస్తున్న చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రంలోని ఓ సన్నివేశంలోని డైలాగ్ ఇది.

ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. శైలజారెడ్డి పాత్రను అత్యంత గంభీరంగా రమ్యకృష్ణ పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ ఎస్‌, పీడీవీ ప్రసాద్ ‌సినిమాను నిర్మిస్తున్నారు. గోపీ సుందర్‌ బాణీలు అందిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను బుధవారం సాయంత్రం విడుదల చేశారు. ‘పిల్ల పిట్టలా ఇంతే ఉన్నా.. పొట్టంతా ఇగోనే’ అనే డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమైంది.

‘ఇప్పుడు నువ్వు ఐ లవ్‌ యు అని ప్రపోజ్‌ చెయ్‌‌.. ఐ లవ్‌ యు టూ అని ఒప్పుకుంటా’ అంటూ అను తన ఇగోను చైతన్య ముందు ప్రదర్శించారు. రమ్యకృష్ణ స్టైల్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంది. నాగార్జున నటించిన ‘అల్లరి అల్లుడు’ సినిమాలోని ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయిత్తు’ పాటను ఈ సినిమా కోసం రీమేక్‌ చేశారు. ఈ రీమేక్‌ పాటలో తమన్నా ఆడిపాడినట్లు తెలిసింది. ఆగస్టు 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Nani to turn as co producer for mohan krishna indraganti movie

  తన సినిమాలకే నిర్మాతగా మారుతున్న నానీ.!

  Feb 21 | న్యాచురల్ హీరోగా నాని వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. త్వరలోనే 'జెర్సీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆయన, తదుపరి సినిమాను విక్రమ్ కుమార్ తో చేస్తున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ... Read more

 • Kesari trailer akshay kumar is ready for the battle of saragarhi

  రొమాలు నిక్కపోడుచుకునేలా అక్షయ్ ‘కేసరి’ ట్రైయిలర్..

  Feb 21 | బాలీవుడ్ లో త్వరలో విడుదల కాబోతున్న అక్షయ్ కుమార్..‘కేసరి’ మూవీకి సంబంధించిన ట్రైయిలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో యుద్దం నేపథ్యంలో సాగనుంది. దేశభక్తిని.. జవాన్ల వీరోచితాన్ని.. సమస్యలను ఎదురోడ్డి... Read more

 • Varun tej and harish shankar s valmiki movie launch

  వరుణ్ తేజ్ తో హరీశ్ శంకర్ ‘వాల్మీకి’ లాంచ్..!

  Feb 21 | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం వాల్మీకి. మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడు హరీశ్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ఇవాళే పట్టాలెక్కేసింది. ఇవాళ... Read more

 • Hum aapke hain koun producer rajkumar barjatya passes away

  ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రాజ్ కుమార్ బర్జాత్యా కన్నుమూత

  Feb 21 | బాలీవుడ్ ప్రముఖ నిర్మాత.. రాజశ్రీ ప్రొడక్షన్స్ అధినేత.. రాజ్ కుమార్ బర్జాత్యా కన్నుమూసారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబాయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూసినట్టు ముంబై సినీ వర్గాలు... Read more

 • Naga babu targets chandrababu in his jabardasth skit style

  నాగబాబు ‘బాలానంద స్వామి’ స్కిట్లో ఆ స్టార్స్..

  Feb 20 | ప్రముఖ తెలుగు నటుడు నాగబాబు మరోసారి తన యూట్యూబ్ చానల్.. ‘మై ఛానెల్ నా ఇష్టం’ ద్వారా కొంత మందిని  టార్గెట్ చేస్తూ  మరో స్కిట్‌ని  వదిలారు. మెగా బ్రదర్ గా గుర్తింపు సాధించిన... Read more

Today on Telugu Wishesh