Chiranjeevi Accepts Green Challenge హరిత ఛాలెంజ్ స్వీకరించిన మెగాస్టార్..

Chiranjeevi accepts green challenge plants three samplings

chiranjeevi, #HarithaHaaram, #MegastarChiranjeevi, #chirufanclub, NTV, Narendra Choudary, #Green Challenge, MP Kavitha, TRS, ss rajamouli, environmental protection, Telangana, tollywood, tollywood, movies, entertainment

Telangana IT Minister KTR’s ‘green challenge’ as part of Haritha Haram evoked a response from various personalities, Now Mega Star Chiranjeevi has become the part of the Green Challenge. Chiranjeevi was seen planting tree saplings at the backward side of his house in Hyderabad.

హరిత ఛాలెంజ్ స్వీకరించిన మెగాస్టార్..

Posted: 07/31/2018 02:46 PM IST
Chiranjeevi accepts green challenge plants three samplings

తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా చారిత్రక సైరా నరసింహరెడ్డి చిత్రంలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. అయితే కాసింత విరామం లభించడంతో తన ఇంట్లో వున్న మెగాస్టార్ కు ఎన్టీవి నరేంద్ర చౌదరి సవాల్ విసిరారు. దీంతో ఇవాళ ఆయన తన ఇంట్లో వెనుకనున్న పెరట్లో మూడు మొక్కలు నాటారు. ఎన్టీవీ ఛానల్ అధినేత నరేంద్ర చౌదరి విసిరిన సవాల్ ను స్వీకరించిన చిరంజీవి... మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వామి అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఒక వీడియోను షేర్ చేశారు.

"ఎన్టీవీ చౌదరి గారు విసిరిన ఛాలెంజ్ ను స్వీకరిస్తూ... ఈరోజు మా ఇంటి పెరట్లో నేను మూడు మొక్కలు నాటడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నాకు ఛాలెంజ్ విసిరి, నాతో ఒక మంచి హరిత కార్యక్రమాన్ని చేయించినందుకు ఎన్టీవీ చౌదరి గారిని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అంటూ వీడియో ద్వారా ఆయన తెలిపారు. పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని మెగాస్టార్ చెప్పారు.

అనంతరం ఆయన మరో ముగ్గురు ప్రముఖులకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లను ఆయన ఈ ఛాలెంజ్ కు నామినేట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles