Sanju Hits The 200 Crore Jackpot బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద ’సంజు‘ సంచలనం

Sanju enters rs 200 cr club in a week ranbir kapoor s film hits jackpot

sanju, sanju box office collection, ranbir kapoor, sanju box office, rajkumar hirani, sanjay dutt, sanjay dutt biopic, sanju 150 crore, sanju collection, sanju total collection, box office, ranbir kapoor, tarun adarsh, sanjay dutt biopic, bollywood

Sanjay Dutt biopic has indeed been welcomed with a jaadu ki jhaappi at the box office. Trade analyst Taran Adarsh reported Sanju made over Rs. 202 crores in its opening week and even surpassed the lifetime collections of PK,

బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద ’సంజు‘ సంచలనం

Posted: 07/06/2018 02:52 PM IST
Sanju enters rs 200 cr club in a week ranbir kapoor s film hits jackpot

బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ జీవిత చరిత్రతో తెరకెక్కిన 'సంజు' సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల హంగామా చేస్తోంది. రణబీర్ కపూర్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి.. అన్ని వర్గాల ప్రేక్షకుల అదరణను సంపాదించింది. తొలి షో నుంచే మంచి టాక్ సంపాదించుకున్న ఈ చిత్రం... మంచి ఓపెనింగ్స్ తో విజయవంతంగా దూసుకెళ్లుంది. ఈ క్రమంలో ఈ ఏడాది విడుదలైన చిత్రాలేవి రాబట్టనంత భారీ వసూళ్ల రాబడుతూ ముందుకు సాగుతుంది.

తొలి వారం రోజుల వ్యవధిలోనే ఏకంగా 200 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రంగా రికార్డును అందుకున్న సంజు.. గత రికార్డులను బద్దలుకొడుతుంది. ఈ చిత్రం తొలివారంలో 202.51 కోట్లు క‌లెక్ష‌న్స్ సాధించిన‌ట్టు సినీ విశ్లేషకుడు త‌ర‌ణ్ ఆద‌ర్శ్ త‌న ట్వీట్ ద్వారా తెలియ‌జేశారు. సంజూ చిత్రంలో రాజ్ కుమార్ హిరాణీ .. సంజ‌య్ ద‌త్ జీవితాన్ని క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్టు చూపించిన సంగ‌తి తెలిసిందే. డ్ర‌గ్గ్స్‌కు అలవాటు పడటం, అక్రమ ఆయుధాల కేసులో జైలు శిక్ష అనుభవించడం, అమ్మాయిల‌తో ఎంజాయ్ చేయ‌డం, మూవీల్లో సెకండ్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టడం.. ఇలా అన్ని కోణాల‌ని చూపించారు.

నాన్ స్టాప్ క‌లెక్ష‌న్స్ తో దూసుకెళుతున్న ఈ చిత్రం రానున్న రోజుల‌లో బాక్సాఫీస్ రికార్డులు చెరిపేయ‌డం ఖాయ‌మ‌ని కూడా  ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా తరణ్ ట్వీట్ చేస్తూ, రణబీర్ కెరీర్లోనే ఈ చిత్రం అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలుస్తుందని చెప్పాడు. తొలివారంలోని తొలి రోజు 34.75 కోట్లు, 2వ రోజు 38.6 కోట్లు, 3వ రోజు అదివారం 46.71 కోట్లు, 4వ రోజు 25.35 కోట్లు, 5వ రోజు 22.10, 6వ రోజు 18.90, 7వ రోజు 16.10 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టిందని, ఈ చిత్రం వసూళ్లు ఇంకా  కొనసాగుతున్నాయని ఆయన ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sanju  box office  ranbir kapoor  tarun adarsh  sanjay dutt biopic  bollywood  

Other Articles

  • Ram pothineni promises to repay to his fans

    అభిమానులకు ఆనందాన్ని వడ్డీతో చెలిస్తా: రామ్

    Nov 17 | యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ తాజాగా ‘హలో గురూ ప్రేమకోసమే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దిల్‌రాజు నిర్మించిన ఆ చిత్రానికి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల... Read more

  • Nandita swetha s akshara launched

    అక్షరగా భయపెట్టేందుకు రెడీ అంటున్న నందిత శ్వేత

    Nov 17 | తెలుగు తెరపై హారర్ థ్రిల్లర్ .. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల జోరు కొనసాగుతూనే వుంది. ఈ నేపథ్యంలోనే 'అక్షర' అనే సస్పెన్స్ తో కూడిన హారర్ థ్రిల్లర్ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో టైటిల్... Read more

  • Raghava lawrence kanchana 3 release date fixed

    అలరిస్తాను.. అలాగే భయపెడతానంటున్న లారెన్స్.!

    Nov 17 | హారర్ థ్రిల్లర్ సినిమాలకి దర్శకత్వం వహించడంలోను .. ఆ సినిమాల్లో కథానాయకుడిగా మెప్పించడంలోను లారెన్స్ సిద్ధహస్తుడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'కాంచన' .. 'కాంచన 2' సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హారర్ ను... Read more

  • Taapsee pannu shares her opinion on pay parity in bollywood

    పారితోషకంపై తాప్సీ అభిప్రాయం ఇది..

    Nov 17 | ఏ చిత్రపరిశ్రమలోనైనా హీరోలకంటే హీరోయిన్స్ కి పారితోషికాలు తక్కువగా ఉంటాయి. అయితే కొంతమంది హీరోయిన్స్, హీరోలతో సమానంగా తమకి పారితోషికాలు ఇవ్వవలసిందేనంటూ తమ గళాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. ఇకనైనా హీరోయిన్స్ పారితోషికాల విషయంలో మార్పు... Read more

  • Taxiwala trailer vijay deverakonda drives a horror car

    టీజర్: 'టాక్సీవాలా' భయపడి.. భయపెడుతున్నాడు..

    Nov 12 | విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'టాక్సీవాలా' ఈ నెల 17న విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం పాటలు హిట్ టాక్ తెచ్చుకోగా, నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో చిత్రం ట్రయిలర్ ను విడుదల చేశారు.... Read more

Today on Telugu Wishesh