Anasuya in late politician YSR's biopic Yatra వెఎస్సార్ బయోపిక్ లో అనుసూయ.. కీలక పాత్రలో..

Yatra anasuya plays crucial role in late politician ysr s biopic

Anasuya, anil ravipudi, mahi v raghav, Venkatesh, YS Reddy, YS Rajasekhar Reddy, YSR biopic, Yatra, Mamootty, Baahubali, 70mm Entertainments, Prabhas, movies, entertainment, tollywood

TV presenter and actress Anasuya is also going to play a short, but crucial part in the upcoming biopic on the life of legendary politician YS Rajasekhar Reddy. Directed by Mahi V Raghav, and produced by 70mm Entertainments, Yatra has been slated for a Sankranti 2019 release.

వెఎస్సార్ బయోపిక్ లో అనుసూయ.. కీలక పాత్రలో..

Posted: 06/30/2018 05:00 PM IST
Yatra anasuya plays crucial role in late politician ysr s biopic

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త క్యారెక్టర్ లో జీవించి.. అద్భుతంగా నటించిన బుల్లితెర‌ యాంక‌ర్ అనసూయ భరద్వాజ్ ప్రేక్షకులలో కూడా చెదరని స్థానాన్ని అక్రమించేసుకున్నారు. దీంతో అమెకు వెండితెర‌ ఆపర్లు వెల్లువలా వస్తున్నాయి. సెల‌క్టెడ్ పాత్ర‌లు ఎంచుకుంటూ బుల్లెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న అనసూయకు రంగ‌స్థ‌లం మంచి బ్రేక్ ఇచ్చింది. రంగ‌మ్మ‌త్త పాత్ర‌తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంసలు అందుకుంది. ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్టులు ఈమె చేతిలో ఉన్నాయి.

తాజాగా వైఎస్ఆర్ బ‌యోపిక్ యాత్ర‌లో కీల‌క పాత్ర కోసం అన‌సూయ‌ని ఎంచుకున్నార‌నే టాక్ వినిపిస్తుంది. క‌ర్నూలు జిల్లాకు చెందిన పాపులర్ మహిళా లీడర్‌గా చిత్రంలో అన‌సూయ క‌నిపిస్తుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవితంలోని ముఖ్య‌మైన ఏ అంశాన్ని వ‌ద‌లకుండా మ‌హీ ఈ సినిమా చేస్తున్నాడ‌ని తెలుస్తుండ‌గా, ఇంద‌లో పాద‌యాత్ర, ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యే స‌న్నివేశాలు అన్నింటిని చూపించ‌నున్నాడ‌ట‌. దివంగ‌త నేత‌ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నారు. 30 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో వైఎస్ విజయమ్మ పాత్ర కోసం బాహుబలి ఫేం ఆశ్రితని సెలక్ట్ చేసారు. వైఎస్ పర్సనల్ అసిస్టెంట్ సూరీడు పాత్ర కోసం పోసాని కృష్ణ మురళి, షర్మిళ పాత్ర కోసం భూమిక, సబితా ఇంద్రా రెడ్డి పాత్ర కోసం సుహాసినిని సెలక్ట్ చేసినట్టు టాక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anasuya  anil ravipudi  mahi v raghav  Venkatesh  YS Reddy  Yatra  Mamootty  Baahubali  Prabhas  tollywood  

Other Articles