Nag Confirmed His Sanjay Dutt Connection మున్నాభాయ్ ఒరవడి చిత్రంలో నాగ్-నానీ

Multi starrer with nani is in raj kumar hirani territory says akkineni

Nagarjuna, nani, nag and nani, nagarjuna and nani, sriram adittya, nagarjuna don, nani doctor, akkineni nagarjuna, nani, telugu, munnabhai, raj kumar hirani, tollywood, entertainment, movies

Nagarjuna seems to be upset with the failure of his recently-released film Officer. However, he has moved on to his next project directed by Sriram Adittya, in which he will be seen sharing screen space with Nani.

మున్నాభాయ్ ఒరవడి చిత్రంలో నాగ్-నానీ

Posted: 06/21/2018 07:36 PM IST
Multi starrer with nani is in raj kumar hirani territory says akkineni

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున .. నాని కథానాయకులుగా ఒక మల్టీ స్టారర్ మూవీ రూపొందుతోంది. నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ .. నాని జోడీగా రష్మిక మందన కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున డాన్ గా కనిపించనుండగా .. డాక్టర్ పాత్రను నాని పోషిస్తున్నాడు. దాంతో ఈ సినిమా అంతా సీరియస్ గా కొనసాగుతుందని అనుకున్నారు. యాక్షన్ పార్టు ఎక్కువగా ఉండొచ్చని భావించారు.

కానీ ఈ సినిమా పూర్తి వినోదభరితంగా సాగుతుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. నాగార్జున .. నాని పాత్రల మధ్య చోటుచేసుకునే హాస్య సన్నివేశాలు ప్రేక్షకులకు గిలిగింతలు పెడతాయని అంటున్నారు. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ ను కదిలించే ఎమోషన్స్ పాళ్లు కూడా ఈ సినిమాలో ఎక్కువగానే ఉన్నాయని చెబుతున్నారు. అశ్వనీదత్ నిర్మిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. త్వరలోనే టైటిల్ ను ఖరారు చేసి .. ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akkineni nagarjuna  nani  telugu  munnabhai  raj kumar hirani  tollywood  entertainment  movies  

Other Articles

Today on Telugu Wishesh