kishan started his career as office boy.. టాలీవుడ్ సెక్స్ రాకెట్: అఫీసు బాయ్ కిషన్.. శ్రీరాజ్ గా.?

Tollywood sex racket kishan and his wife procduced in court

high profile sex racket in Chicago, tollywood actress high profile sex racket, Kishan Modugumudi, chandrakala, court, Vibha Jayam, Chennupati, Tollywood actresses, anchors, temporary visas, Belmont Cragin, chicago, US, America, US, crime

How an office boy modugumudi kishan turned into producer sreeraj then later a sex racket organiser in america's chicago using tollywood female celebrities.

మోదుగుమూడి కిషన్: అఫీసు బాయ్ నుంచి.. అరదండాల వరకు..

Posted: 06/21/2018 02:02 PM IST
Tollywood sex racket kishan and his wife procduced in court

అమెరికాలో హైప్రోఫైల్ సెక్సు రాకెట్ నిర్వాహకుడిగా అభియోగాలు ఎదుర్కోంటున్న మోదుగుమూడి కిషన్ ఆయన భార్య చంద్రకళలను ఫెడరల్ పోలీసులు ఇవాళ ఇల్లినాయిస్ లలోని న్యాయస్థానంలో డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచనున్నారు. అమెరికా వీసా నిబంధనలను కాలరాస్తూ అక్రమంగా నివాసముంటున్నారన్న అభియోగాలపై ఈ దంపతులు మొదట చికాగో పోలీసులు అరెస్టు చేసి న్యాయన్థానంలో ప్రవేశపెట్టారు. దీంతో నెల రోజుల శిక్ష తరువాత జైలు నుంచి విడుదలైన ఈ దంపతులపై పోలీసులు నిఘా పెట్టారు.

ఇందుకు కారణం.. అక్రమంగా నివాస నేపథ్యంలో అరెస్టు చేసిన పోలీసులకు దొరికిన ఓ చిత్తుకాగితం, భారీ సెక్స్ రాకెట్ పై ఉప్పందించగా, పోలీసులు ప్రస్తుతం అమెరికాలోని తెలుగు సంఘాల చరిత్రను తవ్వి తీస్తున్నారు. ఇప్పటికే అమెరికా వెళ్లి, వ్యభిచారం చేశారన్న అనుమానాలున్న హీరోయిన్లను ప్రశ్నించిన అమెరికా పోలీసులు, ఇక ఈ టాలీవుడ్ సెలబ్రిటీలతో సంభోగం చేసిన వారి జాబితాను కూడా సిద్దం చేసే పనిలో వున్నారు.

మొత్తం విచారణ పూర్తి కావడానికి నెల రోజుల సమయం పడుతుందని అక్కడి పోలీసులు చెప్పడంతో అక్కడ అక్రమాలకు పాల్పడి బడాబాబులుగా చెలమణి అవుతున్న మన విటుల గుండెళ్లో కూడా రైలు పరుగెడుతున్నాయి. గడచిన వారం రోజులుగా యూఎస్ లోని తెలుగు అసోసియేషన్ ప్రతినిధులను విచారిస్తున్న పోలీసులకు, తాము నటీమణులకు విమానం టిక్కెట్లు ఇచ్చి పిలిపించి, బస ఏర్పాటు చేయిస్తామని, వారు ఆపై ఏం చేస్తున్నారో తమకు తెలియదని సమాధానం చెబుతున్నట్టు తెలుస్తోంది.

ఇదే సమయంలో హీరోయిన్ల బ్యాంకు ఖాతాలను, ఎయిర్ పోర్టులో జరిపిన ఫారెక్స్ లావాదేవీలను పరిశీలించిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులకు, పెద్దఎత్తున వారి ఖాతాల్లో డాలర్లు జమైనట్టు గుర్తించారు. తమ బ్యాంకు ఖాతాల్లోకి డాలర్లను వేయించుకున్న హీరోయిన్లు, తిరిగి వచ్చే వేళ డాలర్లను రూపాయల్లోకి మార్చుకున్న హీరోయిన్లు ఈ కేసులో ఇబ్బందులు పడక తప్పదని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

అఫీసు బాయ్ నుంచి అమెరికాలో అమ్మాయిలను తార్చే వరకు..

మోదుగుమూడి కిషన్ ఈ పేరు టాలీవుడ్ లలో ఆ మధ్యకాలంలో సుపరిచితం.. ఆ తరువాత మాత్రం అసలు వినిపించనేలేదు. ప్రముఖ దర్శకుడు నాగేష్ కుకునూర్ తో సన్నిహిత్యం పెంచుకుని ఆయన దర్శకత్వంలో రూపోందిన హైదరాబాద్ బ్లూస్, రాక్ ఫార్డ్, బాలీవుడ్ కాలింగ్, అనే చిత్రాలతో మంచి లాభాలను గడించి ఆ తరువాత ఏకగా టాలీవుడ్ లలో మంచు మనోజ్, రవితేజ హీరోలుగా నటించిన చిత్రాలకు కూడా నిర్మాతగా వ్యవహరించి మంచి బ్లాక్ బస్టర్లను అందుకున్నాడు. మరీ ముఖ్యంగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ఇలా కిషన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు.

అయితే అసలు ఆయన కెరీర్ ఎక్కడి నుంచి ప్రారంభమైందని అడిగితే మాత్రం ఆఫీసుబాయ్ స్థాయినుండని చెప్పకతప్పదు. నిజమండీ.. టాలీవుడ్ లో ఆయన కెరీర్ ఆఫీసు బాయ్ నుంచి ప్రారంభమైంది. ఆ తరువాత నెమ్మెదిగా  ఆయన ప్రోడ్యూసర్ అసిస్టెంట్ గా ఎదిగారు. ఈ క్రమంలో ఆయన ఏకంగా టాలీవుడ్ లోని దిగ్గజ నిర్మాతలైన కెఎస్ రామారావు లాంటి వారి వద్ద పనులు నేర్చుకున్నారు. ఆ తరువాత ఆయన ఏకంగా సొంతంగా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఆ తరువాత నిర్మాతగా మారారు.

ఢీ, వెంకీ, దుబాయ్ శ్రీను తదితర బ్లాక్ బస్టర్ చిత్రాలను కూడా నిర్మించాడు. ఈ క్రమంలో మోదుగుమూడి కిషన్ కాస్తా.. శ్రీరాజ్ గా తన నామకరణాన్ని మార్చుకున్నాడు. బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించి.. మంచి ఆదాయాన్ని ఆర్జించిన క్రమంలో ఆయన తన సోంతంగా ఆద్యా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏర్పాటు చేశాడు. వీటిలో డిస్ట్రిబ్యూషన్, టెలీఫిల్మ్ నిర్మాణ, రియల్ ఎస్టేట్ తదితర వ్యాపారాలు కూడా వున్నాయి. అధికారికంగా ఆయన ఎన్నో వ్యాపార వ్యవహారాలు వున్నాయి.

ఇన్ని వున్నా ఆయనకు అధికఆదాయాన్ని తెచ్చిపెట్టే అసలు వ్యాపారం మాత్రం ఎవరికీ తెలియకుండా గుట్టుగానే సాగింది. దీంతో ఆయన అసలు రంగును చిత్తు కాయితం బయటపెట్టగా, దానిని తేలిగ్గా తీసిపారేయని చికాగో పోలీసులు వారి గుట్టగా సాగుతున్న రంకు వ్యాపారాన్ని బయటపెట్టారు. అమెరికాలోని తెలుగసంఘాలు నిర్వహించే ఈవెంట్లు, సంస్కృతిక  కార్యక్రమాలను అసరగా చేసుకుని టాలీవుడ్ నుంచి సెలబ్రిటీలను రప్పించి సెక్స్ రాకెట్ నిర్వహించి వారి ఆర్జనతో పూటగడుపుతున్నాడని తెలసి టాలీవుడ్ వర్గాలు షాక్ అయ్యాయి.

ఎంతో మంది అమ్మాయిలను సినీమా అవకాశాల పేరుతో అమెరికాకు రప్పించుకుని అక్కడ వారిని వ్యబిచారం రోంపిలోకి దింపాడని కూడా చికాగో పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. ఇక సెలబ్రిటీలను ఈవెంట్లకు పిలిచి.. అక్కడ వారితో అసభ్యకార్యకలాపాలను నిర్వహించడంలో కూడా కిషన్ ఘనుడని.. వారు ఈ విషయాలను భయటికి చెప్పకుండా వారిని గట్టిగానే బ్లాక్ మెయిల్ కూడా చేస్తాడని కూడా ఓ క్యారెక్టర్ అర్టిస్టు లేఖతో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

భర్త అడుగుజాడల్లోనే భార్య నడుస్తుండటాన్ని మన పెద్దలు కొనియాడుతారు. కానీ భర్తలు చేసే అక్రమాలను ఏ భార్య సహించదు.. అందులోనూ మరీ మఖ్యంగా అడవాళ్ల మానాలతో వ్యాపారాలు చేయడాన్ని ఏ భార్య మాత్రం అంగీకరిస్తుంది. కానీ కిషన్ హైప్రోఫైల్ సెక్స్ రాకెట్ వ్యాపారంలో అతని భార్య చంద్రకళ అన్ని రకాలుగా అతనికి సహకరించచిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. తన భర్త ఏ సెలబ్రిటీని ఎప్పుడు పిలిచారు. ఎవరెవరికీ ఎంతమేర డబ్బులు చెల్లించారు.. ఎక్కడ ఎప్పుడు ఏ హోటల్ లో  వారికి బస ఏర్పాటు చేశామన్న పూర్తి వివరాల జాబితాను అమె నిర్వహిస్తూ.. భర్త అక్రమాలకు సహకరించారు. దీంతో ఇవాళ వీరిని పోలీసులు అక్కడి న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrakala  flesh trade  Kishan Modugumudi  sreeraj  prostitution racket  Sex trafficking  Tollywood  crime  

Other Articles