tammareddy appeal to media మీడియాకు తమ్మారెడ్డి భరద్వాజ అప్పీల్..

Tammareddy appeal to media

chicago sex racket, tammareddy on chicago sex racket, tammareddy appeal to media, tammareddy bharadwaj, modugubudi kishan, raju, chandra, chandrakala, tollywood, sex racket organiser, tollywood, movies, entertainment

tollywood senior producer and director tammareddy bharadwaj appeal media not to publish any article which damages indutry faith in people,

ఫ్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు తమ్మారెడ్డి భరద్వాజ అప్పీల్..

Posted: 06/18/2018 08:34 PM IST
Tammareddy appeal to media

అగ్రరాజ్యంలో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహించిన మోదుగుమూడి కిషన్ దంపతుల కేసు వ్యవహరం తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో సీనియర్‌ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మీడియాకు ఓ అప్పీల్ చేశారు. ఈ కేసు వ్యవహారంలో టాలీవుడ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే కథనాలను రాయవద్దని ఆయన విన్నవించారు. కిషన్ గతం గురించి పక్కనబెడితే.. ప్రస్తుతం ఆయన ఓ బ్రోకర్.. సెక్సు రాకెట్ నడుపుతున్న వ్యక్తిగానే చూడాలని కోరారు. అలాగే మీరు చూడండీ.. అంతేకాని అతన్ని నిర్మాత అంటూ టాలీవుడ్ మొత్తాన్ని అప్రతిష్టపాలు చేయడం, ఈ కేసును అపాదించడం సరికాదన్నారు.

కిషన్ - చంద్రకళలను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. దాంతోపాటే కొంత మంది బాధితులను కూడా కాపాడారు. ఇందులో కొంతమంది టాలీవుడ్ నటీమణులు పాల్గొని ఉండవచ్చు. అలాగనీ మొత్తం తెలుగు ఇండస్ట్రీకి ఆ రాకెట్‌తో లింకు పెట్టడం సమంజసం కాదని అన్నారు. ఇలాగే కథనాలు వస్తే భవిష్యత్తులో ఇక తెలుగు ఇండస్ట్రీకి అమ్మాయిలు రావడం కానీ, తెలుగమ్మాయిలు కూడా అవకాశాలకు దూరం కావడం జరుగుతుందని, తద్వారా తెలుగుసినీ పరిశ్రమ దెబ్బతింటుందని ఆయన అందోళన వ్యక్తం చేశారు.

ఇక నటీమణులు కూడా భవిష్యత్తులో జరిగే ఈవెంట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ - ఫిల్మ్ చాంబర్‌లకు ఓ మాట చెప్పి విదేశీ ఈవెంట్లకు వెళితే మంచిదని సూచించారు. ‘ఈవెంట్ల పేరిట జరుగుతున్న ఈ చీకటి వ్యవహారాల్లో తెలిసో.. తెలీకో తెలుగు సంఘాలు కూడా ఇన్ వాల్వ్ అయ్యాయి. ఆ సంఘాల పేరుమీదే వీసాలు జారీ అవుతున్నాయి. ఇన్విటేషన్స్ పంపుతున్నారు. అలాంటప్పుడు వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత తెలుగు సంఘాలపై కూడా ఉంటుంది’ అని తమ్మారెడ్డి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles