Harry Potter stuntman for Chiranjeevi's film చిరంజీవి సైరా చిత్రానికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్..

Hollywood stunt coordinator roped in for the chiranjeevi s sye raa

Entertainment News,Telugu Movies News,Tollywood News,Sye Raa Narasimha Reddy,Surender Reddy,hollywood stunt coordinator,Gary Powell,chiranjeevi, movies, entertainment, tollywood

For Megastar Chiranjeevi’s next with Surender Reddy ‘Sye Raa Narasimha Reddy’ film, Hollywood stunt choreographer Gary Powell has been roped in by the makers to coordinate the action sequences in the film.

చిరంజీవి సైరా చిత్రానికి హాలీవుడ్ స్టంట్ మాస్టార్..

Posted: 06/13/2018 07:39 PM IST
Hollywood stunt coordinator roped in for the chiranjeevi s sye raa

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ కి సంబంధించి మరో తాజా అప్ డేట్ లభించింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం రూపోందుతున్న ఈ చిత్రానికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్ గ్రెగ్ పావెల్ ను ఎంపిక చేశారన్న టాక్ ఇప్పుడు చిత్రపురి వీధుల్లో చర్చనీయాంశంగా మారింది. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారన్న వార్తలతోనే అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డీ హాలివుడ్ రేంజ్ లో రూపోందిస్తున్నారని టాక్.  అందుకే యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్ గ్రెగ్ పావెల్‌ను ఎంపిక చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఉన్నట్లు సమాచారం. నగరంలోని వేసిన సెట్‌లో తెరకెక్కిస్తున్న యాక్షన్ సన్నివేశాలను ఆయన పర్యవేక్షిస్తున్నారట. గ్రెగ్ పావెల్‌తో కలసి దర్శకుడు సురేందర్ రెడ్డి తీసుకున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో ఇద్దరూ నోట్లో సిగార్ పెట్టుకుని చాలా కూల్‌గా కనిపిస్తున్నారు. ‘సైరా’పై సురేందర్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఇప్పుడు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ ఈ సినిమాకు పనిచేస్తుండటంతో ‘సైరా’పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. బ్రిటన్‌కు చెందిన గ్రెగ్ పావెల్ గతంలో జేమ్స్‌బాండ్ మూవీ ‘స్కైఫాల్’, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 6’, ‘హ్యారీ పోటర్’ వంటి భారీ హాలీవుడ్ చిత్రాలకు పనిచేశారు. బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ ‘హాలీడే’, సల్మాన్ ఖాన్ ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ చిత్రాలకు కూడా గ్రెగ్ పనిచేశారు. ఇక ఈ చిత్రంలో భాగస్వాములైన జగపతిబాబు, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, ప్రగ్యా జైశ్వాల్, బ్రహ్మాజీ అదనపు అకర్షణగా నిలవునున్నారు. రూ.150 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘సైరా’. వచ్చే ఏడాది విడుదల చేయడమే లక్ష్యంగా షూటింగ్ జరుపుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Devadas first lyrical song hey babu released

    దేవదాస్ నుంచి తొలి పాట విడుదల

    Sep 17 | మన్మధుడు చిత్రంలో అందమైన బామలు.. లేత మెరుపు తీగలు అంటూ పాట పాడి.. తన అభిమాన లోకాన్ని ఊర్రూతలూగించిన అక్కినేని నాగార్జున.. చేసిన ఓ ట్వీట్ అభిమానుల్లో అసక్తిని.. ఉత్కంఠకు తేరలేపింది. అదేంటంటే ఆయన... Read more

  • Hello guru prema kosame teaser talk hot sensuous

    ఆకట్టుకుంటున్న హలో గురూ ప్రేమకోసమే టీజర్

    Sep 17 | రామ్ .. అనుపమ పరమేశ్వరన్ జంటగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో 'హలో గురూ ప్రేమకోసమే' సినిమా రూపొందింది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక రొమాంటిక్ టీజర్ ను రిలీజ్ చేశారు. హీరోహీరోయిన్లపై ఒక... Read more

  • 100 million views for ram charan and samantha akkineni s rangamma mangamma

    రాంచరణ్ ‘రంగస్థలం’ పాట కూడా రికార్డు సృష్టించింది

    Sep 17 | మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నటించిన గ్రామీణ నేపథ్యంలోని రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం రంగస్థలం తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక రికార్డులను తిరగరాసిన విషయం తెలిసిందే. అటు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల... Read more

  • Actor and director captain raju passes away in kochi

    నటుడు, దర్శకుడు కెప్టెన్ రాజు కన్నుమూత

    Sep 17 | ప్రముఖ నటుడు, విలన్, కారెక్టర్ ఆర్టిస్ట్ కెప్టెన్ రాజు మృతి చెందారు. ఈ నెల జూలైలో చెన్నై నుంచి మస్కట్ వెళ్తుండగా.. విమానంలో ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ అయ్యింది. దీంతో ఆయనను మొదట మస్కట్‌లోని... Read more

  • Kalyan ram is all set to join ntr biopic

    తాత బయోపిక్ లో తండ్రి అవతారంలో కాళ్యాణ్..

    Sep 15 | క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్ రూపొందుతోంది. బాలకృష్ణ ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా చకచకా షూటింగు జరుపుకుంటోంది. ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా... Read more

Today on Telugu Wishesh