actress samanta wants to kidnap this cute boy.. why.? సమంత ఆ చిన్నారిని కిడ్నాప్ చేస్తానంది.. ఎందుకు.?

Actress samanta wants to kidnap this cute boy why

Samanta wants to kidnap this boy, samanta rangamma, samantha cute dance, samanta tweet, Rangasthalam, Ram Charan, Sukumar village drama, Pawan Kalyan, Samantha Akkineni, devisri prasad, Baahubali franchise, movies, entertainment, tollywood

south indian actress wants to kidnap this cute boy, who dance was appaulsed by one and all.

సమంత ఆ చిన్నారిని కిడ్నాప్ చేస్తానంది.. ఎందుకు.?

Posted: 06/08/2018 03:43 PM IST
Actress samanta wants to kidnap this cute boy why

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ కెరియర్ బెస్ట్ చిత్రంగా నిలిచిన రంగస్థలం చిత్రంలో ఫలానా పాట అని చెప్పడం కన్నా అన్ని పాటలు హిట్ అయ్యాయని చెప్పడం కరెక్ట్. ఈ చిత్రంలో ‘రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు..’ ఈ పాట ఎంత పాపులర్‌ అయ్యిందంటే.. ఇప్పటికే కాదు ఇంకో ఏడాది పోయినా ఈ పాట మాత్రం నిత్యం తెలుగు ప్రేక్షకుల మదిలో మెదలుతూనే వుంటుంది. ఈ పాటకు సమంత, రామ్ చరణ్ డ్యాన్స్ హైలైట్ గా నిలిచింది.

చాలా మంది నెటిజన్లు ఈ పాటకు పేరడీలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీటిలో తనకు ఎంతో నచ్చిన కొన్ని వీడియోలకు సమంత రిప్లై కూడా ఇచ్చారు. తాజాగా ఓ చిన్నారి ‘రంగమ్మ’ పాటకు డ్యాన్స్‌ చేసిన వీడియోను ఓ నెటిజన్‌ ట్విటర్లో షేర్‌ చేశారు. తెలంగాణ జాతిపిత ప్రోఫెసర్ జయశంకర్ చిత్రం ముందు ఈ తెలంగాణ బుడ్డోడు డాన్స్ ఇరగదీశాడు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలు తెరుచుకున్న నేపథ్యంలో పాఠశాల తొలినాళ్లలోనో లేక జూన్ 2న తెలంగాణ అవిర్భావ దినోత్సవం సందర్భాంగానో ఈ డాన్స్ చేసి వుండవచ్చని భావిస్తున్నాడు.

ఈ వీడియోను పోస్టు చేసిన ఓ వ్యాపారవేత్త.. దీనిని ఒక్కసారి చూసి ఊరుకోలేరు, మళ్లీ మళ్లీ చూడాలని అనిపిస్తోంది’ అంటూ సమంత, అనసూయ, సుకుమార్ ను ట్యాగ్‌ చేశారు. బుడ్డోడి డ్యాన్స్ కు సమంత ఫిదా అయ్యారు. ‘సరే.. ఈ క్యూటీని నేను కిడ్నాప్‌ చేస్తా’ అంటూ లవ్‌ సింబల్స్‌ను ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ చిన్నారి వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్‌ అవుతోంది. నెటిజన్లు బుజ్జిగాడి డ్యాన్స్‌కు ఫ్యాన్స్‌ అయిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rangasthalam  Ram Charan  Sukumar  school boy dance  Samantha Akkineni  devisri prasad  tollywood  

Other Articles