'Taxiwala' even quits from June race నిదానమే ప్రధానమంటున్న ‘టాక్సీవాలా’..

Taxiwala even quits from june may hit screens in july

taxiwala, vijay devarakonda, arjun reddy, science fiction movie, rahul sankrityan, Priyanka Jawalkar, Malavika Nair, latest movie news, tollywood, movies, entertainment, telugu movies

After an impressive outing with Arjun Reddy, reigning star Vijay Devarakonda is coming up with an interesting science fiction thriller Taxiwala which is directed by Rahul Sankrityan even quits from june race.

నిదానమే ప్రధానమంటున్న ‘టాక్సీవాలా’..

Posted: 06/04/2018 06:51 PM IST
Taxiwala even quits from june may hit screens in july

అర్జున్ రెడ్డి చిత్రంతో తన మార్కెట్ ను విస్తరించుకుని తెలుగు ప్రేక్షకులలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పర్చుకున్న విజయ్ దేవరకొండ.. తన తదుపరి చిత్రంతో మరింత క్రేజ్ సంపాదించాలని బావిస్తున్నాడు. అదే టాక్సీవాలా. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్లు విడుదల కావడంతో ఈ చిత్రం కూడా హిట్ అవుతుందన్న అంచనాలు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ చిత్రం కావడంతో కూడా అంచనాలు మరింతగా పెంచుతున్నాయి. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో  రూపొందుతున్న ఈ 'టాక్సీవాలా' విడుదలపై మాత్రం అభిమానుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతుంది.

ఈ సినిమాను పిల్లలు అత్యధికంగా ఇష్టపడతారని భావించిన చిత్ర యూనిట్.. దీనిని వేసవి రేసులో వుంచాలని తొలత భావించింది. దీంతో మే 14వ తేదీన విడుదల చేయాలని కూడా సిద్దమైంది. అయితే ఆ తరువాత కొన్ని రోజులకి .. ఈ సినిమాను జూన్ 14వ తేదీన థియేటర్లకు తీసుకువస్తున్నట్టుగా విజయ్ దేవరకొండ  ట్వీట్ చేశాడు. అయితే ఇప్పుడు జూన్ 14న కూడా విడుదల సందేహమనే వార్తలు చిత్రపురి వీధుల నుంచి వినిపిస్తున్నాయి. జూన్ 14న కూడా ఈ సినిమా విడుదల కష్టమని టాక్ బలంగా వినిపిస్తోంది.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు విజయ్ దేవరకొండ క్రేజ్ కి తగినట్టుగా లేవనీ, ఆ సన్నివేశాలను రీ షూట్ చేస్తే బాగుంటుందని టీమ్ భావించిందట. ప్రస్తుతం వాళ్లు ఆ పనిలోనే వున్నారని అంటున్నారు. ఈ కారణంగానే ఈ సినిమాను జూలైలో విడుదల చేయాలనుకుంటున్నారట.  ఒక టాక్సీవాలాకు.. ఒక ఆత్మకు మధ్య జరిగే ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా కొనసాగుతుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన కథానాయికలుగా ప్రియాంక జవాల్కర్ .. మాళవిక నాయర్ కనిపించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : taxiwala  vijay devarakonda  rahul sankrityan  Priyanka Jawalkar  Malavika Nair  tollywood  

Other Articles