Balakrishna to produce his Next బయోపిక్ కాకుండా మరో చిత్రానికి కూడానా.?

Balakrishna to produce his next

Balakrishna, Boyapati Srinu, NBK Films, Balakrishna news, Balakrishna updates, Balakrishna latest, Balakrishna new film, Balakrishna next movie, Balakrishna latest updates, tollywood, movies, entertainment

Balakrishna signed a political drama in the direction of Boyapati Srinu which will be launched officially on June 10th on the eve of Balakrishna’s birthday. The latest news we hear is that the film will be made on a massive budget and Balakrishna is in plans to produce the film.

బయోపిక్ కాకుండా మరో చిత్రానికి కూడా బాలయ్యే నిర్మాత.?

Posted: 05/24/2018 06:48 PM IST
Balakrishna to produce his next

యువరత్న నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని తానే నిర్మిస్తున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంతో పాటు మరో చిత్రానికి కూడా ఆయనే నిర్మాణ బాధ్యతలను చేపట్టనున్నారా.? అంటే అవుననే చిత్రపురి వర్గాల సమాచారం. ప్రస్తుతం వివి వినాయక్ దర్శకత్వంలో రూపోందుతున్న చిత్రం షూటింగ్ లో బిజిగా వున్నారు బాలయ్య.. ఈ నెల 27న అధికారికంగా ప్రారంభం కానున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి విడుదల కానుంది. ఆ తరువాత ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం చేయనున్నారు. ఈ చిత్రానికి ఆయనే నిర్మాతగా వ్యవహరించనున్న విషయం తెలిసిందే.

అయితే ఎన్టీఆర్ తో బయోపిక్ తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాటయ్య మరో చిత్రంలో కూడా నటించేందుకు రెడీ అయ్యారు. అయితే అధికారికంగా ఈ విషయాన్ని తన జన్మదినం సందర్భంగా జూన్ 10న బాలకృష్ణ వెల్లడించనున్నారు. అంతేకాదు. ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్ తో నిర్మితం అవుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి కూడా తానే నిర్మతగా వ్యవహరించాలని బాలయ్య భావిస్తున్నారని సమాచారం. బాలయ్య ఎన్బీకే ఫిల్మ్ బ్యానర్ పైనే వరుసగా రెండు చిత్రాలను నిర్మించడానికి కూడా రెడీ అవుతున్నారని ఇది సరిగ్గా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు విడుదల చేయడానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నారని సినీవర్గాల బొగట్టా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Boyapati Srinu  NBK Films  producer  tollywood  movies  entertainment  

Other Articles