Tamil actress gets murder threat అలా నటిస్తావా.. చంపేస్తా: నటికి బెదిరింపు కాల్స్..

Young tamil actress gets murder threat for allegedly acting nude

young actress threat calls, threat calls to young actress, tamil debutante actress, 18-05-2009, threat, threatening calls, Subash Chandra Bose, Tamil actress threat calls, dhanya threaten kill, Tamil actress, threat calls to actress dhanya, threat calls to actress rafiya banu, threat calls to actress for nude acting, vadapalani, nude scene, foreign number, publicity stunt, latest movie news, kollywood, movies, entertainment

A young debutante actress Dhanya aka Rafiya Banu has apparently lodged a police complaint that some unknown person has called her on cell phone in the middle of the night and threatened to murder her for acting nude in an upcoming film '18.05.2009'.

అలా నటిస్తావా.. చంపేస్తా: నటికి బెదిరింపు కాల్స్..

Posted: 05/18/2018 05:23 PM IST
Young tamil actress gets murder threat for allegedly acting nude

దక్షిణాది యువనటి ధన్య అలియాస్ రఫియా భానుకు బెదిరింపు ఫోన్ కాల్స్ ఇప్పుడు కొలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 18.05.2009 చిత్రంతో తెరగ్రేటం చేస్తున్న ధన్యాకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి హతమారుస్తామంటూ హెచ్చరికలతో కూడి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈ విషయంలో ఆమె చెన్నై, వెపేరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘నో కాలర్ ఐడీ’, కాలర్ ఐడీ లేని ఫోన్ నెంబర్లతో పాటు విదేశాలకు చెందిన ఫోన్ నెంబర్ల 447404617369 నంబర్ల నుంచి అమెకు బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంతో అమెతో పాటు చిత్ర యూనిట్ కూడా అందోళన చెందుతుంది.

దీంతో పోలీసులను అశ్రయించిన ఆమె తనకు వచ్చిన నెంబర్లలను పోలీసులకు సమర్పించిన పిర్యాదులో పేర్కొనింది.  “నువ్వు ఒంటరిగానే ఉంటున్నావు. నిన్న చంపేస్తాను” అని బెదిరిస్తున్నారని ఆమె తెలిపింది. ఇటీవల ఆమె ‘18.05.2009’ అనే చిత్రంలో నటించగా, అది విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో కథపరంగా అమె న్యూడ్ గా నటించాల్సి వచ్చింది. దాంతో ఈ చిత్రంలో నటించింది నువ్వేగా, నిన్ను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు అమెకు హెచ్చరికలు జారీ చేస్తూ ఫోన్ కాల్స్ చేస్తున్నారు.

వడపళని పరిధిలోని తిరునగర్ సెకండ్ స్ట్రీట్ లో ధన్య తన తల్లితో కలసి నివసిస్తుండగా, ఈ నెల 14 అర్ధరాత్రి 1.15 గంటల సమయంలో ఆమెకు ఫోన్ చేసిన వ్యక్త అసభ్యంగా మాట్లాడాడు. “ఆ సినిమాలో నటించింది నువ్వేగా, బయటకు రా… నీ పని చెప్తా” అంటూ బెదిరింపులకు దిగాడు. తాను కేవలం నటించానని, ఏమైనా సమస్య ఉంటే దర్శక, నిర్మాతలతో తేల్చుకోవాలని ఆమె చెప్పినా వినలేదు. ఇక సదరు గుర్తుతెలియని వ్యక్తి కాల్ తో తాను చాలా బయపడుతున్నానని, అతనిపై చర్యలు తీసుకోవాలని తాన్య, తన ఫిర్యాదులో పోలీసులను కోరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dhanya  rafiya banu  threat calls  nude scene  foreign number  publicity stunt  kollywood  

Other Articles