Tollywood director Rajasimha attempts suicide టాలీవుడ్ దర్శకుడి ఆత్మహత్యాయత్నం

Tollywood director rajasimha attempts suicide

director rajasimha suicide attempt, writer rajasimha suicide attempt, rajasimha, suicide attempt, director, Sandeep Kishan, Rudramadevi, Oka Ammayi Tappa, writer, tollywood, movies, entertainment

Telugu writer, director Rajasimha Tadinada, who directed Sandeep Kishan’s Oka Ammayi Tappa, attempted to commit suicide by taking a heavy dose of sleeping pills in a hotel room in Mumbai.

ముంబైలో టాలీవుడ్ దర్శకుడి ఆత్మహత్యాయత్నం

Posted: 05/17/2018 01:36 PM IST
Tollywood director rajasimha attempts suicide

“అందమైన లోకమని రంగురంగులుంటాయని అందరూ అంటుంటారూ రామ రామ.. అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మా.. ” అని ప్రముఖ సీనీ కవి అచార్య అత్రేయ అనాడే సినీపరిశ్రమ గురించి చెప్పాడు. అయితే అనుకున్న తడవుగా అవకాశాలు రాక.. అనుకున్న స్థాయిలో తమకు ఖ్యాతి రాక.. అనేక ఇబ్బందులు పడేవారు కూడా అనేక మంది వున్నారని కూడా ఎందరో చెప్పారు. టాలెంట్ ఒక్కటే కాదు అదృష్టం కూడా కలసిరావాలని మరికొందరు చెబుతున్నా.. టాలెంట్ వుంటే చాలు అదే దరిని చేరుస్తుందని నమ్మి సినీ సంద్రంలోకి అడుగుపెట్టి.. గల్లంతైన వాళ్లు కూడా లేకపోలేదు.

తాజాగా అదే అశతో అడుగుపెట్టి.. తన ప్రతిభను చూపినా.. అనుకున్న మేర అవకాశాలు రాక.. తనకు అసలు గుర్తింపు లేక.. ఇబ్బందులు పడుతున్న ఓ దర్శకుడు కూడా మనోవేధనకు గురై అత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అనుష్క ప్రధానపాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'రుద్రమదేవి' చిత్రానికి మాటలు రాసిన రచయిత, దర్శకుడు రాజసింహ ముంబైలో ఈ విపరీత చర్యకు పాల్పడ్డాడు.  సందీప్ కిషన్ హీరోగా నటించిన 'ఒక్క అమ్మాయి తప్ప' చిత్రంతో దర్శకుడిగానూ తానేంటో నిరూపించుకున్న రాజసింహ ఆత్మహత్యయత్నానికి పాల్పడటానికి మనోవేదనే కారణమా.? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ముంబైలో నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లగా, అతన్ని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్టు సమాచారం. సోఫాలో ఉలుకు, పలుకు లేకుండా ఆయన పడివుండగా, బంధువులు చూసి ఆసుపత్రికి తీసుకెళ్లారు. సినీ వినీలాకాశంలో అనుకున్నంతగా రాణించలేకున్నానని, తన కెరీర్ ను అభివృద్ధి చేసుకోవడంలో వెనుకబడి ఉన్నానన్న మనస్తాపంతోనే రాజసింహ ఈ పని చేసినట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajasimha  suicide attempt  director  Sandeep Kishan  Rudramadevi  Oka Ammayi Tappa  writer  tollywood  

Other Articles