tamanna's hot private dance going viral నెట్టింట్లో తమన్నా ఛాలెంజ్ వీడియో వైరల్

Dj snake magenta riddim dance by tamanna bhatia

dj snake, magenta riddim dance, tamanna bhatia, magenta riddim challenge, dance video, DJ Snake, Magenta Riddim Dance, social media, movies, entertainment, tollywood, kollywood, bollywood, viral videos, trending news

Tamanna took up challenge of DJ Snake, a world-renowned DJ based in Paris, and show off her moves for his popular track Magenta Riddim, which is going viral on social media.

నెట్టింట్లో తమన్నా ఛాలెంజ్ వీడియో వైరల్

Posted: 05/16/2018 04:05 PM IST
Dj snake magenta riddim dance by tamanna bhatia

‘హ్యాపీ డేస్’ చిత్రంతో తెలుగ చిత్రపరిశ్రమలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రేక్షకులలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న నటి తమన్న.. నృత్యాలలో మాత్రం అగ్రశేణిస్థానాన్ని అందుకుంది. అమెలా డాన్స్ చేయడం మిగిలిన నటీమణులకు కొంతమేర కష్టమనే చెప్పాలి. ఎంతటి కష్టతరమైన స్టెపులనైనా.. తమన్నా సునాయాసంగా ఎలాంటి శ్రమలేకుండా చక్కగా చేస్తుంది. దీంతో ఈ అమ్మడు ఐటమ్ సాంగ్స్ అపర్లు మాత్రం పెద్దగానే వచ్చాయని చెప్పాలి. రాంచరణ్ తో కలిసి రచ్చ చిత్రంలో నటించిన అమ్మడు.. రాజమౌళి దర్శకత్వం వహంచిన ‘బాహబలి’పార్ట్ 1 లో అవంతిక పాత్రలో అప్సరసలా మెరిసింది.

దాంతో ఈ అమ్మడి పేరు జాతీయ స్థాయిలో మారుమోగింది. ఇక బాలీవుడ్ లో కూడా రెండు మూడు చిత్రాల్లో నటించింది. తాజాగా ఈ అమ్మడు చేసిన ఒక హాట్ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కుర్రాళ్ల మతి పోగొడుతూ చేసిన ఈ డాన్స్ వీడియోకు కుర్రకారు లైకుల మీద లైకులతో పాటు కామెంట్లు కూడా పెడుతున్నారు. వావ్ ఎంత చక్కగా డాన్స్ చేశావ్ అమ్మడూ అని ఒకరు కామెంట్ చేస్తే.. మంచి అభినేత్రి అంటూ మరోకరు ఇలా తమ్మన్నాపై కామెంట్ల వర్షం కురుస్తుంది.

అసలు ఈ ముద్దుగుమ్మపై ఈ తరహాలో ఇప్పుడు కామెంట్ల వర్షం, లైకుల సునామీ ఎందుకంటారా..? అసలు విషయం ఏంటంటే.. ఇటీవల తమన్నాకు, పారిస్ కు చెందిన ప్రముఖ డీజే అయిన డీజే స్నేక్ మధ్య సోషల్ మీడియాలో సంభాషణ జరిగింది. స్నేక్ మాట్లాడుతూ బాహుబలి చిత్రాన్ని చూశానని తమన్నా ఫెర్ఫామెన్స్ బావుందని అన్నారు. తమన్నా కూడా స్నేక్ కు బదులిచ్చింది. ఇటీవల స్నేక్ ఆల్బమ్ నుంచి విడుదలైన మాగంట రిథమ్ సాంగ్ తనకు చాలా బాగా నచ్చిందని తమన్నా తెలిపింది. ఇంతవరకు బాగానే వున్నా ఇక్కడే అసలు సమస్య రాజుకుంది.

తన మాగంట రిథమ్ పాటకు డాన్స్ చేయగలవా అంటూ స్నేక్ ఛాలెంజ్ విసిరాడు. దానికి రియాక్ట్ అయిన తమన్నా..ఆ ఛాలంజ్ ని సీరియస్ గా తీసుకుంది. తమన్నా తనదైన శైలిలో మాగంట రిథమ్ పాటకు డాన్స్ చేసి దుమ్ము దులిపేసింది. ఆ సాంగ్ కు తమన్నా చేసిన డాన్స్ ప్రస్తుతం యువతని కుదిపేస్తోంది. గత ఏడాది విడుదలైన ఎన్టీఆర్ జై లవకుశ చిత్రంలో తమన్నా ఐటెం సాంగ్ చేసింది. స్వింగ్ జర అనే ఈ సాంగ్ ఇప్పటికి యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ సాంగ్ లో తమన్నా మరింత జోష్ తో చేసిన డాన్స్ యువత మతి పోగొడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tamanna bhatia  dance video  DJ Snake  Magenta Riddim Dance  viral videos  movies  entertainment  

Other Articles