allu aravind proposal was opposed by film chamber bigwigs అల్లు అరవింద్ ప్రతిపాదనపై మిశ్రమ స్పందన..

Allu aravind proposal was opposed by film chamber bigwigs

allu aravind, casting couch, film chamber, pawan kalyan, mega family, sri reddy, three media houses, TV 9, TV 5, ABN andhra jyothy, film industry, tollywood, movies, entertainment

In a meeting was held in film chamber and Aravind appealed to all bigwigs of Tollywood to boycott the programs of three media channels who are constantly targeting film industry and in particularly Mega family, but was opposed by several bigwigs from industry.

అల్లు అరవింద్ ప్రతిపాదనపై మిశ్రమ స్పందన..

Posted: 04/24/2018 02:55 PM IST
Allu aravind proposal was opposed by film chamber bigwigs

తెలుగు చలనచిత్ర పరిశ్రమను టార్గెట్ చేసి చౌకబారు ప్రచారంతో సినీ పరిశ్రమలోని కొందరు నటీ నటులను, సాంకేతిక నిపుణులను టార్గెట్ గా చేసుకుని వారిపై బురదజల్లే ప్రచారానికి బ్రేకులు వేయాలని వెళ్లిన స్టార్ ప్రోడ్యూసర్ అల్లు అరవింద్ ప్రయత్నానికి కళ్లాలు పడ్డాయి. సినీ పరిశ్రమతో సంబంధం లేని వ్యక్తలు.. పరిశ్రమకు చెందిన వ్యక్తుల వ్యక్తిగత జీవితాలపై కూడా చర్చించేలా ప్రేరేపిస్తున్న మీడియా సంస్థలను నిషేధించాలన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్  వ్యాఖ్యలను ప్రతిపాదనగా ఆయన ఫిలిం చాంబర్ పెద్దల ముందుకు తీసుకువెళ్లారు.

ఈ ప్రతిపాదన నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ కూడా రెండు వర్గాలుగా విడిపోయిందన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ ప్రతిపాదనకు కొందరు సరే అంటే, మరికోందరు మాత్రం వ్యతిరేకంచారని.. మిశ్రమ స్పందన లభించడంతో.. అనుకూలంగా తక్కువ సంఖ్యలో వుండటంతో మీడియా ఛానెళ్ల బహిష్కరణ ప్రతిపాదనకు పూర్తిస్థాయి మద్దతు సంపాదించడంలో విఫలమయ్యారని సమాచారం. పలువురు సినీపెద్దలు అల్లు అరవింద్ ప్రతిపాదనను తిరస్కరించారని కూడా వార్తలు వస్తున్నాయి.

దీంతో టాలీవుడ్ వర్గాల్లో ప్రస్తుతం మోగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన కొన్ని ఛానెళ్లకు సిసీ పెద్దల నుంచి కూడా అండదండలు వున్నాయన్న వార్తలు కూడా నిజమని.. ఈ ప్రతిపాదన నేపథ్యంలో అది బహిరంగంగా ప్రస్పూటించిందన్న విమర్శలు వినబడుతున్నాయి. ఇక ఇండస్ట్రీలో ఐక్యతరాగం లేకపోవడం కూడా ఒక కారణమని తెలుస్తుంది. సినీ పరిశ్రమలో వున్న పెద్దలు.. కుటుంబసభ్యులాంటి సినిమావాళ్లకు మద్దతు పలకకుండా.. టీవీ చానెళ్లను వెనకేసుకురావడం విడ్డూరంగా వుంది. ఇది చిత్రపరిశ్రమలోని ఐక్యతను కూడా చాటుతుందని గుసగుసలు కూడా వినబడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles