karate kalyani questions casting couch srireddy శ్రీరెడ్డికి కరాటే కల్యాణి ప్రశ్నల వర్షం..

Karate kalyani questions casting couch srireddy

karate kalyani questions sri reddy, sri reddy karate kalyani, sri reddy vimala, sri reddy daughter, karate kalyani, sri reddy, casting couch, luxury flat, costly car, twitter, tollywood, movies, entertainment

tollywood actress karate kalyani questions sri reddy alias vimala, how she got luxury flat in lodha builders and costly car.?

శ్రీరెడ్డికి కరాటే కల్యాణి ప్రశ్నల వర్షం..

Posted: 04/21/2018 03:54 PM IST
Karate kalyani questions casting couch srireddy

టాలీవుడ్ లో పెనుదుమారం రేపిన కాస్టింగ్ కౌచ్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి.. మహిళలకు సినీ రంగంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ.. లీకులు రిలీస్ చేస్తున్న శ్రీరెడ్డి అలియాస్ విమలపై మరో టాలీవుడ్ నటి కరాటే కల్యాణి ఫేస్ బుక్ యుద్ధం ప్రారంభించింది. 'శ్రీరెడ్డి లీక్స్' పేరిట కొన్ని ఫొటోలను పోస్టు చేసి, శ్రీరెడ్డి టాలీవుడ్ లో కలకలం రేపినట్టే.. కల్యాణి కూడా కొన్ని ఫొటోలు పోస్టు చేసింది.

ఈ సందర్భంగా ఆమె వాటిపై స్పందిస్తూ, శ్రీరెడ్డి అసలు పేరు విమల అని పేర్కోన్నారు. ఫేస్ బుక్ వేదికగా ‘కల్యాణి లీక్స్ (truths) అంటూ శ్రీరెడ్డిని టార్గట్ చేస్తూ  ప్రశ్నల వర్షం కురిపించింది. తనకు పెళ్లి కాలేదని చెప్పిన విమల అలియాస్ శ్రీరెడ్డికి ఇంత పెద్ద కూతురు ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె విజయవాడ శ్రీ చైతన్యలో ఇంటర్ చదువుతోంది. మొన్ననే ఆ చదువు కూడా పూర్తైపోయింది. ఇప్పుడు అమ్మతోనే కలసి వుంటుందని.. ఇంతకీ ఎలా వచ్చింది అన్న అమె ప్రశ్నించారు.

విమల (శ్రీరెడ్డి) కు కుటుంబంతో 10 సంవత్సరాల నుండి సంబంధం లేకపోతే కొంత కాలం క్రిందట కూకట్‌ పల్లిలో లోథా మెరిడియన్ లో కోటిన్నర ఖరీదైన లగ్జరీ ఫ్లాట్ కొనిందని, తన తల్లితో కలిసి ఆ ఇంటిని ఎలా గృహప్రవేశం చేసిందని కల్యాణి ప్రశ్నించింది. ఖరీదైన కార్లలో తిరగడానికి, ఆ ఫ్లాట్ కొనడానికి శ్రీరెడ్డికి డబ్బులెలా వచ్చాయని కరాటే కల్యాని ప్రశ్నించారు. ఇక చివర్లో ‘‘ఏంటో విమలా నీకే తెలియాలి..’’ అంటూ కన్ క్లూడ్ చేసి.. ఇంకొన్ని విషయాలను నాకు నచ్చినప్పుడు లీక్ చేస్తాను. ఎందుకంటే నా లీక్స్ నా ఇష్టం’’ అంటూ పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : karate kalyani  sri reddy  casting couch  luxury flat  costly car  facebook  tollywood  movies  entertainment  

Other Articles