Mehreen Pirzada Counter To Man on Kathua tweet చెంపచెల్లుమనిపించేలా కౌంటర్ ఇచ్చిన మెహ్రీన్

Mehreen pirzada counter to man on kathua tweet

mehreen pirzada, kathua gang rape, asifa, justice to asifa, gangrape, hindustan, devi-stah temple, murder, jammu and kashmir, netzen, counter, tollywood, movies, entertainment

Tollywood actress mehreen pirzada gives a strong reply to the netzen who say her to go out of hindustan to her twitter post in favour of justice to asifa

నెట్ జన్ దిమ్మదిరిగి బొమ్మ కనిపించేలా చేసిన నటి

Posted: 04/16/2018 05:41 PM IST
Mehreen pirzada counter to man on kathua tweet

నటీనటులు ఒకప్పుడు ఒకటి రెండు పర్యాయాలు అటోచించి.. అప్పుడు కానీ తాము స్పందించాల్సిన అంశంపై మాట్లాడేవాళ్లు కాదు. అయితే తరం మారింది. ఇక విప్లవాత్మక మార్పులు కూడా వచ్చేశాయి. మనం ఏం చెప్పాలనుకుంటున్నామో.. దానిని కేవలం మన సామాజిక మాద్యమంలో పెడితే చాలు.. అదే యావత్ ప్రపంచం పర్యటించేస్తుంది. మనకు తెలిసిన వారే కాదు.. తెలియని వారు కూడా ఈ పోస్టులపై తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తుంటారు. దీంతో నేటి తరం నటీనటులు సామాజిక అంశాలపై, వారిని కదిలించిన అంశాలపై ఎప్పటికప్పుడు తమ అభిమానులతో పంచుకుంటునే వుంటారు.

తాజాగా కాశ్మీర్లోని కతువాలో ఎనిమిదేళ్ల బాలిక అసిఫాపై సామూహిక అత్యాచారం, హత్య ఘటన దేశం మొత్తాన్ని కదిలించిన సంగతి తెలిసిందే. వివిధ రంగాలకు చెందిన పలువురు వ్యక్తులు దీనిపై తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సినీ నటి మెహరీన్‌ తన ట్విట్టర్ ఖాతాలో ‘నేను హిందుస్థానీని, సిగ్గుపడుతున్నాను, ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, హత్య, ఒక ఆలయంలో’ అంటూ ‘అసిఫాకు న్యాయం జరగాలి’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ ను జత చేసిన, ప్లకార్డుతో దిగిన ఫొటోను పోస్ట్‌ చేసింది.

దీనిపై ఒక నెటిజన్ మండిపడుతూ, ‘హిందుస్థానీగా ఉండటం నీకు అంత సిగ్గుగా అనిపిస్తే దేశాన్ని విడిచి వెళ్లిపో. హిందుస్థానీయులుగా ఉన్నందుకు మేం చాలా గర్విస్తున్నాం. పిల్లలపై ఇలాంటి దారుణాలు అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా జరుగుతున్నాయి. వాళ్లు ఎప్పుడూ ఇలా ఓవర్‌ యాక్షన్‌ చేయలేదు’ అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో ఒళ్లు మండిన మెహరీన్ ప్రతిస్పందిస్తూ, ‘నీలాంటి వారి కోసమే ఈ పోస్ట్‌ చేశా’ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది. దీనికి ఆమె అభిమానులు, నెటిజన్లు ‘సరిగ్గా చెప్పావ్‌, మీకు మద్దతు ఇస్తున్నాం, అంటూ ఆమెను ప్రోత్సహిస్తూ, అలాంటి వారిని పట్టించుకోవద్దని సలహా ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mehreen pirzada  kathua gang rape  asifa  jammu and kashmir  netzen  counter  tollywood  movies  entertainment  

Other Articles

 • Jeevitha rajashekar complaints on sandhya for allegations

  మహిళా సంఘం నేత సంధ్యపై.. పోలీసులకు పిర్యాదు చేసిన జీవిత

  Apr 17 | టాలీవుడ్ లో కాస్టింగ్‌ కౌచ్‌ అంశంపై చర్చ సందర్భ:గా తన భర్త పట్ల, తన పట్లు జుగుప్సాకరమైన అరోపణలు చేసిన మహిళా సంఘం నేత సంధ్యపై టాలీవుడ్ నటి, నిర్మాత జీవితా రాజశేఖర్ జూబ్లీహిల్స్... Read more

 • Pawan kalyan tollywood fans gave befiitting reply to sri reddy

  పవన్ కల్యాన్ సీనీ అభిమానగణం.. ఏమన్నారో తెలుసా..?

  Apr 17 | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఇందుగలరు.. అందులేరు అన్న సందేహము వలదు.. ఎందెందు వెతికినా కనబడు అన్నట్లుగా స్వతహాగా టాలీవుడ్ చిత్రపరిశ్రమలో హీరోలుగా వెలుగొందుతున్న వారు కూడా అయన అభిమానులే అనడంలో సందేహం... Read more

 • Chranjeevi pays tributues to senior actor raghavaiah

  బెనర్జీ కుటుంబానికి చిరంజీవి పరామర్శ..

  Apr 16 | ప్రముఖ నటుడు బెనర్జీ తండ్రి, సీనియర్‌ నటుడు రాఘవయ్య(86) ఇటీవలే కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల టాలీవుడ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.... Read more

 • Vivek oberoi praised ram charan action in rangasthalam

  రంగస్థలం చిట్టిబాబుకు బాలీవుడ్ నటుడి ప్రశంస

  Apr 13 | ‘రంగస్థలం’ చిత్రం అంచనాలకు మించి సక్సెస్ సాధించడంతో మెగా పవర్ స్టార్ హీరో రామ్ చరణ్ కు టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు అందుతున్న వేళ.. అటు బాలీవుడ్ నటుడు నుంచి కూడా హీరో చెర్రికి... Read more

 • Beautiful love from allu arjun s naa peru surya is a melodious romantic

  లవ్ సాంగ్ పాడుతున్న ‘నా పేరు సూర్య’

  Apr 13 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పోలీసు అధికారి పాత్రలో నటిస్తున్న చిత్రంపై ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి. వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ రూపొందిస్తున్న చిత్రం 'నా పేరు... Read more

Today on Telugu Wishesh