Vivek Oberoi Praised Ram Charan రంగస్థలం చిట్టిబాబుకు బాలీవుడ్ నటుడి ప్రశంస

Vivek oberoi praised ram charan action in rangasthalam

Rangasthalam, Ram charan, Vivek Oberoi, twitter, Sukumar, Samantha Akkineni, Aadhi Pinisetty, bollywood, tollywood, movies, entertainment

Bollywood actor Vivek Oberoi praises mega power star Ram Charan for his best performence in Rangasthalam, which became a mega block buster creating a new record in non baahubali movie collections.

రంగస్థలం చిట్టిబాబుకు బాలీవుడ్ నటుడి ప్రశంస

Posted: 04/13/2018 09:00 PM IST
Vivek oberoi praised ram charan action in rangasthalam

‘రంగస్థలం’ చిత్రం అంచనాలకు మించి సక్సెస్ సాధించడంతో మెగా పవర్ స్టార్ హీరో రామ్ చరణ్ కు టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు అందుతున్న వేళ.. అటు బాలీవుడ్ నటుడు నుంచి కూడా హీరో చెర్రికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రామ్ చరణ్ ను అభినందిస్తూ ఓ ట్వీట్ చేశాడు. ‘చిట్టిబాబూ సౌండ్ ఇంజనీర్!!! రంగస్థలం సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది మై బ్రదర్ రామ్ చరణ్! ... నువ్వు ‘మెగా’ కాంబోకు చెందిన సూపర్ స్టార్, సూపర్ పర్ఫార్మర్ వి. గాడ్ బ్లస్ యూ, గర్వంగా ఉంది! అత్యద్భుతమైన చిత్ర యూనిట్ కు అభినందనలు! సలాం’ అని  ఆ ట్వీట్ లో వివేక్ ఒబెరాయ్ ప్రశంసలు కురిపించారు.

'రంగస్థలం' భారీ వసూళ్లతో కొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతూ.. తాజాగా 'ఖైదీ నెంబర్ 150' రికార్డును కూడా అధిగమించింది.  నాన్ 'బాహుబలి' వసూళ్ల లో బాక్సాఫీసు రికార్డులను తిరగరాసేందుకు రంగస్థలం సిద్దంగా వుంది. బాహుబలి తరువాత స్థానంలో వున్న 'ఖైదీ నెంబర్ 150' సినిమాను రంగస్థలం క్రాస్ చేయడానికి రెడీగా వుంది. తొలిరోజునే 128 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం.. 13వ రోజు పూర్తయ్యేనాటికి 161 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఇక 14వ రోజుకి 'ఖైదీ నెంబర్ 150' రికార్డును అధిగమించిందని సినీ విశ్లేషకుడు జీవీ ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles