టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పోలీసు అధికారి పాత్రలో నటిస్తున్న చిత్రంపై ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి. వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ రూపొందిస్తున్న చిత్రం 'నా పేరు సూర్య' నా ఇల్లు ఇండియా. ఈ సినిమా మే 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతుండగా, ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్ కనిపించనుంది. విశాల్ - శేఖర్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. విశాల్ శేఖర్ స్వరపరిచిన రెండు పాటలను ఇప్పటికే వదలగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ' బ్యూటీ ఫుల్ లవ్' అనే పాటని రిలీజ్ చేశారు.
'పెదవులు దాటని పదం పదంలో.. కనులలో దాగని నిరీక్షణంలో .. నాతో ఏదో అన్నావా.. " అంటూ ఈ పాట కొనసాగుతోంది. చక్కని లవ్ ఫీల్ తో అలా అలా సాగే ఈ పాట దృశ్యం పరంగా చూస్తే నిజంగానే బ్యూటీఫుల్ గా అనిపిస్తుందని చెప్పొచ్చు. సిరివెన్నెల సాహిత్యం .. విశాల్ శేఖర్ సంగీతం అనుభూతి ప్రధానంగా .. ఆహ్లాదకరంగా కొనసాగుతూ హాయిని కలిగిస్తున్నాయి. ఈ నెల చివరిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుని, వచ్చేనెల 4వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
(And get your daily news straight to your inbox)
Apr 17 | టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంశంపై చర్చ సందర్భ:గా తన భర్త పట్ల, తన పట్లు జుగుప్సాకరమైన అరోపణలు చేసిన మహిళా సంఘం నేత సంధ్యపై టాలీవుడ్ నటి, నిర్మాత జీవితా రాజశేఖర్ జూబ్లీహిల్స్... Read more
Apr 17 | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఇందుగలరు.. అందులేరు అన్న సందేహము వలదు.. ఎందెందు వెతికినా కనబడు అన్నట్లుగా స్వతహాగా టాలీవుడ్ చిత్రపరిశ్రమలో హీరోలుగా వెలుగొందుతున్న వారు కూడా అయన అభిమానులే అనడంలో సందేహం... Read more
Apr 16 | నటీనటులు ఒకప్పుడు ఒకటి రెండు పర్యాయాలు అటోచించి.. అప్పుడు కానీ తాము స్పందించాల్సిన అంశంపై మాట్లాడేవాళ్లు కాదు. అయితే తరం మారింది. ఇక విప్లవాత్మక మార్పులు కూడా వచ్చేశాయి. మనం ఏం చెప్పాలనుకుంటున్నామో.. దానిని... Read more
Apr 16 | ప్రముఖ నటుడు బెనర్జీ తండ్రి, సీనియర్ నటుడు రాఘవయ్య(86) ఇటీవలే కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల టాలీవుడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.... Read more
Apr 13 | ‘రంగస్థలం’ చిత్రం అంచనాలకు మించి సక్సెస్ సాధించడంతో మెగా పవర్ స్టార్ హీరో రామ్ చరణ్ కు టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు అందుతున్న వేళ.. అటు బాలీవుడ్ నటుడు నుంచి కూడా హీరో చెర్రికి... Read more