Rao Ramesh's Mother No More! రావు రమేష్ కు మాతృవియోగం..

Rao ramesh s mother passes away

Rao Ramesh's Mother No More!, Rao Gopal Rao wife dies, Rao Kamala Kumari passes away, Rao Ramesh, Rao Gopal Rao, Rao kamala kumari, Mother, Rao Ramesh mother no more, Rao Kamala Kumari death, tollywood

Actor Rao Ramesh mother and wife of renowned actor late Rao Gopal Rao, Rao Kamala Kumari has passed away on Friday night at their residence at kondapur in Hyderabad, who has been sick from sometime

రావు రమేష్ కు మాతృవియోగం..

Posted: 04/07/2018 11:49 AM IST
Rao ramesh s mother passes away

ప్రముఖ సినీ నటుడు రావు రమేష్‌కు మాతృవియోగం కలిగింది. దివంగత ప్రముఖ విలక్షణ నటుడు రావు గోపాలరావు సతీమణి.. కమలాకుమారి (73) అనారోగ్యంతో నేటి(శనివారం) ఉదయం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కమల కుమారి కొండాపూర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
 
కమల కుమారి చాలా గొప్ప కళాకారిణి. హరికథా ప్రదర్శనలో దిట్ట. ఆమె 5000లకు పైగా వివిధ రాష్ట్రాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. కమల కుమారి ఓ స్టేజి షో ఇస్తుండగా చూసిన రావు గోపాలరావు ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు. రావుగోపాల రావు, కమలాకుమారీలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కమల కుమారి పెద్ద కుమారుడే రావు రమేష్.

కమలాకుమారీ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, కమలాకుమారి మరణవార్త తెలిసిన వెంటనే... రావు రమేష్ నివాసానికి మెగాస్టార్ చిరంజీవి వెళ్లారు. రావు రమేష్ తోపాటు ఇతర కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles