Stylish Romantic Song in Bharat Ane Nenu | రొమాంటిక్ మూడ్ లోకి మారిపోయిన భరత్

Bharat ane nenu romantic song

Mahesh Babu, Kiara Advani, Koratala Siva, Bharat Ane Nenu, Romantic Song, Raju Sundaram

Stylish Romantic song is being canned between Mahesh Babu and Kiara Advani. Popular choreographer Raju Sundaram is composing the dance moves for this song. Read more at telugu360: Mahesh and Kiara Advani dance for romance https://www.telugu360.com/?p=166192

భరత్ అనే నేను.. రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ

Posted: 03/12/2018 05:06 PM IST
Bharat ane nenu romantic song

సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను సమ్మర్ రేసుకు సిద్ధమైపోతోంది. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఏప్రిల్ మొదటి వారం కల్లా గుమ్మడి కాయ కొట్టేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

ప్రస్తుతం లీడ్ పెయిర్ మహేష్-కైరా అద్వానీలపై ఓ రొమాంటిక్ పాటను చిత్రీకరిస్తున్నారు. పాపులర్ కొరియోగ్రాఫర్ రాజు సుందరం ఈ పాటను కంపోజ్ చేస్తున్నట్లు సమాచారం.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుత రాజకీయ నేపథ్యాలను ప్రశ్నించేదిగా ఉండబోతోంది. ప్రజలకు ఇచ్చే హామీలను నెరవేర్చే ముఖ్యమంత్రి పాత్రలో మహేష్ కనిపించబోతున్నాడు. ఏప్రిల్ 20న భరత్ అనే నేను ప్రేక్షకుల ముందుకు రానుంది.

సితార స్టన్నర్...

మహేశ్ బాబు కూతురు సితారతో హీరోయిన్ కైరా అద్వానీ తాజాగా ఓ ఫొటో దిగింది. సెట్స్ కు వచ్చిన సితారతో కలిసి సరదాగా ఫోజు ఇచ్చింది. ఆ ఫొటోను కైరా తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. సితారను ‘స్టన్నర్’ అభివర్ణించిన కైరా, సినిమా సెట్స్ కి ‘స్టన్నర్’ వచ్చినప్పుడు ఈ ఫొటో దిగానని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles