Senior Hero Stylish Look Gone Viral | వెంకీ.. ఇంతలా మారిపోయాడేంటి?

Venky stylish look for next

Venkatesh, Stylish Look, Director Teja, Aata Nade Veta Nade, ANVN Regular Shoot, Aata Nade Veta Nade Hero

Tollywood Senior Hero Venkatesh Daggubati Stylish Look Gone Viral on Internet. Venky New Make over for Teja Movie Aata Nade Veta Nade begins soon.

తేజ కోసం స్టైలిష్ గా వెంకీ

Posted: 03/09/2018 09:49 AM IST
Venky stylish look for next

టాలీవుడ్ అగ్రనటుల్లో విక్టరీ వెంకటేష్ ప్రయోగాలకు కాస్త దూరంగానే ఉంటాడు. అయినప్పటికీ రీమేక్ లతో సాహసాలు చేస్తుంటాడనే చెప్పొచ్చు. గురు తో హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చిన ఈ విక్టరీ స్టార్.. దర్శకుడు తేజ తో కలిసి ఆటా నాదే.. వేటా నాదే చిత్రం కోసం సిద్ధమైపోయాడు.

త్వరలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం వెంకీ మేకోవర్ ఎలా ఉండబోతుందో అన్న అంచనాలు అభిమానుల్లో ఉన్నాయి. అయితే గురు నుంచి మెయింటెన్ చేసిన అదే గడ్డం లుక్కుతో కనిపించటంతో.. ఏజ్ బార్ క్యారెక్టర్ అయి ఉంటుందని అంతా భావించారు.

కానీ, తాజాగా రిలీజ్ చేసిన వెంకీ ఫోటోలు చాలా స్టైలిష్ గా ఉండటంతో ఒక్కసారిగా అంతా తలకిందులైపోయింది. ఫ్రొఫెసర్ లా ఓ మెచ్యూర్డ్ లుక్కుతో ఉన్న ఈ సీనియర్ హీరో.. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఉన్న ఈ చిత్రంలో ఎలా అలరించబోతున్నాడో. అన్నట్లు శ్రీయా ఇందులో హీరోయిన్ గా కనిపించబోతుండగా.. నారా రోహిత్, ఇషా రెబ్బ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అనూప్ సంగీతాన్ని అందిస్తుండగా.. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్-సురేష్ ప్రొడక్షన్స్ వాళ్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles