Anchor Rashmi Request on a Whats app Video | వాట్సాప్ వీడియోను పోస్ట్ చేసి మరీ రిక్వెస్ట్ చేస్తున్న రష్మీ

Rashmi posted girl torture video in twitter

Tollywood Anchor, Rashmi Gautam, Rashmi Twitter, Girl Harass Video, Rashmi Request, Rashmi Whats app Video

Anchor Rashmi Gautam share a Video and Request in Twitter to take action on this. In that Forwarded Video a Kid harassed by Man.

చిన్నారిని హింసించిన వీడియో పోస్ట్ చేసిన రష్మీ

Posted: 02/23/2018 05:30 PM IST
Rashmi posted girl torture video in twitter

బుల్లితెర యాంకర్, నటి రష్మీ గౌతమ్ ఫేస్ బుక్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. తన హృదయాన్ని కదిలించిన వీడియో అంటూ ఓ బాలికను ఓ వ్యక్తి హింసిస్తున్న వీడియో అది. ఇది పాత వీడియో అయి వారు పట్టుబడితే సంతోషిస్తాననే.. అలాకానీ పక్షంలో వాళ్లను పట్టుకోవాలని కోరుతున్నట్లు ఆమె తెలిపింది.

వీడియోను తనకెవరో ఫార్వడ్ చేశారని, దీనిని షేర్ చేయాలని తనకు అనిపించిందని ఆమె తెలిపింది. వీడియో చూస్తుంటే...ఆ అమ్మాయి ఇష్టానికి వ్యతిరేకంగా అతను ఇంత దారుణంగా ఆమెను హింసిస్తున్నట్లు తెలుస్తోందని భావిస్తున్నట్లు ఆమె తెలిపింది. తానిప్పటి వరకు ఎక్కడా ఇలాంటి సంఘటనకు సంబంధించిన వార్త కళ్లారా చూడనేలేదని ఆమె అంది. అందుకే దీనిని షేర్ చేస్తున్నానని, తాను చేసింది కరెక్టేనని భావిస్తున్నట్లు ఈ క్రేజీ యాంకర్ పేర్కొంది.

ఈ వీడియోలో ఇంత దారుణానికి పాల్పడుతున్న వ్యక్తిని, అందుకు సహకరించిన వారిని, అక్కడే ఉండి కళ్లప్పగిచ్చి ప్రేక్షక పాత్ర వహించిన వారినీ...ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పైశాచిక చర్యకు పాల్పడిన వారందరినీ సైబర్ విభాగం పోలీసులు గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని కూడా మానవత్వం ఉన్న నెటిజన్లు కోరుతున్నారు. బహుశా దెయ్యాలను వదిలించటం లాంటి తంతులో భాగంగానే ఇది చేసి ఉంటారని అనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌‌గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles