Aham Brahmasmi not Belongs to Varun Tej | అహం బ్రహ్మాస్మి.. అందుకే ఈ కన్ఫ్యూజన్

Aham brahmasmi belongs to krish

Aham Brahmasmi, Varun Tej, Director Krish, Aham Brahmasmi Title, Aham Brahmasmi Venkatesh, Aham Brahmasmi Allu Arjun

Aham Brahmasmi not Varun Tej Space Thriller. It is Director Krish upcoming Project Producers Officially Confirmed.

అహం బ్రహ్మాస్మి.. క్రిష్ ప్రాజెక్టు!

Posted: 02/22/2018 03:14 PM IST
Aham brahmasmi belongs to krish

గత మూడు రోజులుగా ఓ టైటిల్ తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అహం బ్రహ్మాస్మి పేరుతో ఓ టైటిల్ రిజిస్ట్రర్ కావటం.. అది సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కే సినిమా టైటిల్ అని చెప్పుకున్నాం. అయితే కంటెంట్ కి .. ఎంచుకున్న టైటిల్ కి సంబంధం లేదనే సందేహం తలెత్తినా సంబంధింత నిర్మాతలు రిజిస్ట్రర్ చేయటంతో అదే అని ఫిక్సయ్యారు.

ఆ తర్వాతే అసలు విషయం తేలింది. నిజంగానే ఈ కథకీ .. టైటిల్ కి ఎలాంటి సంబంధం లేదు. ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న రాజీవ్ రెడ్డి .. జాగర్లమూడి సాయిబాబు ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించడంతో ఇలా ప్రచారం జరిగింది. వాళ్లు ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించింది క్రిష్ తదుపరి సినిమా కోసమనేది తాజా సమాచారం.

దర్శకుడు క్రిష్ 'అహం బ్రహ్మాస్మి' అనే టైటిల్ తో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఇందులో ఓ అగ్రహీరో నటించనున్నాడనేది టాక్. రేసులో వెంకీ, అల్లు అర్జున్ పేరు వినిస్తున్నాయి. అగష్టు నుంచి చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles