Kshanam Hindi Remake Trailer Released | బాఘీ-2 ట్రైలర్.. ‘క్షణం’ రీమేక్ ఇలాగ కూడా తీయొచ్చా?

Baaghi 2 official trailer out

Baaghi 2, Kshanam Remake, Baaghi 2 Trailer, Tiger Shroff, Disha Patani, Kshanam Hindi Trailer, Baaghi 2 Trailer Review, Director Ahmed Khan, Sajid Nadiadwala

Baaghi 2 Official Remake of Telugu Kshanam Trailer Released. It is an action film produced by Sajid Nadiadwala and directed by Ahmed Khan. A Nadiadwala Grandson Entertainment production, presented by Fox Star Studios, the movie stars Tiger Shroff & Disha Patani in lead role. The movie is set to release on 30th March 2018.

బాఘీ-2 ట్రైలర్.. ఫుల్లీ యాక్షన్ సీన్లు

Posted: 02/21/2018 04:13 PM IST
Baaghi 2 official trailer out

బాఘీ 2 చిత్ర ట్రైలర్ వచ్చేసింది. తెలుగు హిట్ మూవీ క్షణం రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టైగర్ ష్రాఫ్, దిశా పఠానీ జోడీగా కనిపించనున్నారు. అయితే మాతృకను బాగా మార్చేసిన దర్శకుడు స్టోరీలో చాలానే మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

పాప కిడ్నాప్ నేపథ్యంలోనే కథను నడిపించినప్పటికీ.. యాక్షన్ ఎపిసోడ్స్ ను మాత్రం బాగా చేర్చేశాడు. దిశతో టైగర్ రొమాన్స్.. ఆ తర్వాత కథ సీరియస్ మోడ్ లోకి వెళ్లిపోవటం.. గ్యాంగ్ స్టర్లతో హీరో చేసే ఫైట్లు హైలెట్ గా నిలిచాయి. ముఖ్యపాత్రల్లో రణ్ దీప్ హుడా, మనోజ్ బాజ్ పాయిలు నటించారు. ఆర్మీ అధికారి పాత్రలో టైగర్ కనిపించనున్నాడు. గోవా మాఫియా గుట్టును రట్టు చేసి.. కిడ్నాపైన పాపను రక్షించటమే కథాంశంగా చిత్రం తెరకెక్కింది.

అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సాజిద్ నడియా వాలా నిర్మిస్తున్నాడు. మార్చి 30న సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles