Rana turns Demon King from This August | రానా రాక్షస రాజుగా మారే సమయం వచ్చింది

Rana turns hiranyakashipu for gunasekar

Rana Daggubati, Director Gunashekar, Hiranyakashipu, Rana SVR Hiranyakashipu Role, Hiranyakashipu Movie

Tollywood actor Rana Daggubati has had his share of starring in historical films and his tryst with period flicks continues, with director Gunashekar signing him up to play King Hiranyakashipu in his upcoming film. Reports suggest that Gunashekar has signed the actor up to play the demon king in the film and Rana has agreed. Regular Shooting goes floor from August.

రానా హిరణ్యకశప సెట్స్ మీదకు వెళ్లేది అప్పుడే!

Posted: 02/20/2018 03:10 PM IST
Rana turns hiranyakashipu for gunasekar

చాలా కాలం పాటు సక్సెస్ లేకుండా పోయిన దర్శక నిర్మాత గుణశేఖర్.. 'రుద్రమదేవి' వంటి చారిత్రక కథాంశం ఉన్న చిత్రంతో మెప్పించారు. ఆ చిత్రం తర్వాత గ్యాప్ తీసుకున్న ఆయన తర్వాతి చిత్ర విషయంలో సస్పెన్స్ మెయింటెన్ చేస్తూ వస్తున్నారు. అయితే ఆ మధ్య కాలంలో ఆయన నుంచి వినిపించిన సబ్జెక్టు పైనే వర్కవుట్ చేస్తున్నారన్నది ఇప్పుడు తేలింది.

'హిరణ్యకశిప' అనే పౌరాణిక చిత్రాన్ని భారీస్థాయిలో తెరపై ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చాలాకాలంగా గోప్యంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది 'భక్త ప్రహ్లాద' కథే అయినప్పటికీ, హిరణ్యకశిపుడి కోణంలో కొనసాగుతుందన్న మాట. టైటిల్ రోల్ ను దగ్గుబాటి రానా చేయనున్నాడు. దీంతో ఈ ప్రాజెక్టు ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్టు తెలుస్తోంది. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుందని చెబుతున్నారు. దీనిని సురేశ్ ప్రొడక్షన్స్ .. గుణ టీమ్ వర్క్స్ పై సంయుక్తంగా నిర్మించనున్నారనే టాక్ వినిపిస్తోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. చిత్ర ప్రారంభం రోజే విడుదలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles