Tollywood celebrities share relation with Hanumantha Rao హనుమంతరావుతో అనుబంధాలను పంచుకున్న ప్రముఖులు

Telugu comedians and actors share relation with gundu hanumantha rao

gundu hanmantha rao passes away, gundu hanmantha rao no more, gundu hanmantha rao, comedian, telugu movies, tollywood, rajendra prasad, bramhanandam, shivaji raja, kadambari kiran, chiranjeevi, telanagana government

Telugu comedians and actors share relation with Gundu Hanumantha Rao, who, died on Monday morning at the age of 61. The actor was suffering from heart and kidney ailments and was undergoing treatment.

గుండుతో అనుబంధాలను పంచుకున్న ప్రముఖులు

Posted: 02/19/2018 11:42 AM IST
Telugu comedians and actors share relation with gundu hanumantha rao

హాస్య దృవతారగా తెలుగు వెండితెరపై వెలిగిన గుండు హనుమంత రావు మరణంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది. 2010లో ఆయన భార్య మృతి చెందిన నాటి నుంచి నిత్యం అమె అలోచనలోనే వుండిపోయిన హనుమంతరావు సమయానికి బోజనం చేయకుండా తన అరోగ్యాన్ని పాడుచేసుకున్నారు. దీంతో ఆయన శరీరంలోని రెండు మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతిన్నడంతో అనారోగ్యం బారిన పడ్డారని కుటుంబ సభ్యులు తెలిపారు. సతీ వియోగం తరువాత ఆయన ఒక్క తనయుడు అమెరికాకు వెళ్లి మెకానికల్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. తనకు అనారోగ్యమని చెప్పడంతో.. తిరిగి వచ్చిన తనయుడు తన తండ్రి బాగోగులను చూసుకుంటూ ఇక్కడే వుండిపోయాడని కూడా టాలీవుడ్ వర్గాలు తెలిపాయి.

బ్రహ్మానందం:
గుండు హన్మంతరావు పార్థివదేహాన్ని సందర్శించిన ప్రముఖులు రాజేంద్రప్రసాద్, ప్రముఖనటుడు బ్రహ్మానందం, మా అధ్యక్షుడు శివాజీరాజా. తదితరులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పరిశ్రమలో తనకున్న అతితక్కువ మంది మిత్రుల్లో గుండు హనుమంతరావు ఒకరని ఆయన బోరున విలపించారు. గుండుతో తనకున్న మూడు దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఆయన 'అహనా పెళ్లంట' సినిమా తామిద్దరికీ ఎంతో గుర్తింపును తెచ్చిందని గుర్తుచేసుకున్నారు.

రాజేంద్రప్రసాద్:
ఆ తరువాత నటుడు రాజేంద్ర ప్రసాద్, గుండుతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మాయలోడు, పేకాట పాపారావు, హైహై నాయకా, కొబ్బరి బొండాం వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తాము కలసి నటించామని, తాను హీరోగా చేసిన దాదాపు 50 సినిమాల్లో గుండు హనుమంతరావు నటించి మెప్పించారని అన్నారు. "నా దురదృష్టం... నాతో పాటు ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎంఎస్ నారాయణ వంటివానిని నేను కోల్పోయాను. ఇవాళ మరొక... నా సోదరుడి వంటి వాడిని కోల్పోయాను. అందరమూ వెళ్లిపోవాల్సిందే. ఇక్కడ ఎవరమూ పర్మినెంట్ కాదు. కాకపోతే... ఒక మనసుకు నచ్చిన వ్యక్తి గుండు హనుమంతరావు. నటుడిగా కన్నా మంచి వ్యక్తిగా నాకు తెలుసు" అని భావోద్వేగంతో మాట్లాడారు.

శివాజీరాజా:
మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడు శివాజీరాజా తామిద్దరమూ ఒకటి, రెండు సినిమాల తేడాతో చిత్ర రంగంలోకి ప్రవేశించామని, 'కళ్ళు' చిత్రంలో తనది చూపులేని పాత్ర అయితే, ప్రధాన పాత్ర ఆయనదేనని చెప్పారు. ఆపై ఎన్నో చిత్రాల్లో కలసి నటించామని గుర్తు చేసుకున్నారు. తన జీవితంలో ఆయన ఎవరి వద్దా చేయి చాచి అడగలేదని అన్నారు. ఆయన ఆరోగ్యం బాగాలేకుంటే, కేసీఆర్, కేటీఆర్, చిరంజీవి వంటి వారెందరో సాయం చేశారని, మొత్తం ఎంత డబ్బు పోగయిందో తాను లెక్కలు చెబితే, "ఇక చాలు, ఆపరేషన్ కు సరిపోతాయి. మరెవరి వద్దా తీసుకోవద్దు" అని ఆయన చెప్పారని శివాజీరాజా గుర్తుచేసుకున్నారు. ఆయన అరోగ్యం ఇంత సీరియస్ గా ఉందని తనకు తెలియలేదని కన్నీరు పెట్టారు. గుండు కుటుంబానికి 'మా' అండగా ఉంటుందని చెప్పారు

ఎస్వీ కృష్ణారెడ్డి :

గుండు హనుమంతరావు మంచి ఆర్టిస్ట్‌. మంచి వ్యక్తి. ఏ సన్నివేశం ఇచ్చినా కామెడీకి కామెడీ.. సెంటిమెంట్‌కి సెంటిమెంట్‌ పండించేవారు. ఇంత మంచి ఆర్టిస్ట్‌ ఒక రేంజ్‌కి ఎదుగుతారని అనుకున్నాం కానీ అలా రాలేకపోవడం నిజంగా దురదృష్టం. ఆయన లేకపోవడం చాలా బాధాకరం. ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ సినిమాలో గుండు పాత్రను ఆయన కోసమే రాశాను. ఎలాంటి కామెడీనైనా పండించగల వ్యక్తి గుండు హనుమంతరావు. ఇప్పటికీ ఆయన కామెడీ స్టైల్‌ వేరని ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు.

మురళీ మోహన్‌

తనకు, గుండు హనుమంతరావుకి ఎప్పటినుంచో పరిచయం ఉందని ప్రముఖ సినీనటుడు, నిర్మాత, పార్లమెంటు సభ్యుడు మురళీ మోహన్ అన్నారు. నాటక రంగంలోకి వచ్చి అక్కడి నుంచి సినిమా రంగానికి వచ్చారు. ఎన్నో దేశాల్లో దాదాపు 3000లకు పైగా ప్రదర్శనలలో పాల్గొని మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి మంచి మనిషి ఈరోజు లేరంటే నమ్మలేకపోతున్నానని అన్నారు.

మోహన్‌బాబు

తమ నిర్మాణ సంస్థ నిర్మించిన చాలా సినిమాల్లో గుండు హనుమంత రావు నటించారని సినీనటుడు, నిర్మాత మోహన్ బాబు అన్నారు. ఆయన మంచి నటుడు మాత్రమే కాదు మంచి వ్యక్తి కూడా అని చెప్పారు. ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల సమర్థుడు. అలాంటి వ్యక్తి ఇవాళ మనల్ని భౌతికంగా విడిచి వెళ్లడం బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోనిబ్బరం ప్రసాదించాలని ఆ షిరిడి సాయినాథుడిని వేడుకుంటున్నానని మోహన్ బాబు బాధతప్త హృదయంతో అన్నారు.

హీరో బాలకృష్ణ:

చిత్ర పరిశ్రమ మంచి నటుడ్ని కోల్పోయిందని హీరో బాలకృష్ణ తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆరోగ్యకరమైన హాస్యాన్ని యావత్‌ తెలుగు ప్రేక్షకులకు పంచిన గుండు హనుమంతరావు మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని అవేదన వ్యక్తం చేశారు. ఆయనతో కొన్ని సినిమాల్లో కలిసి నటించానని గుర్తు చేసుకున్న బాలకృష్ణ.. ఆయన మృదు స్వభావని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరి, దేవుడు ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాన్నారు..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles