No More Mass Roles for Akkineni Hero | ఇకపై అలాంటి తప్పు చెయ్యను.. హీరో సుమంత్

Sumanth on upcoming projects

Hero Sumanth, Sumanth Upcoming Movies, Action Movies, Sumanth 2018 Movies

Hero Sumanth on his upcoming Movies. Akkineni Hero Clarifies no more action roles.. Only Characters which is Suitable to his Body Language Only.

ఇకపై మాస్ పాత్రలు చెయ్యను : సుమంత్

Posted: 02/17/2018 04:36 PM IST
Sumanth on upcoming projects

కెరీర్ ప్రారంభంలో వరుసగా సక్సెస్ లు చూసిన అక్కినేని హీరో సుమంత్.. తర్వాత వరుసగా ఓ టైప్ ఆఫ్ సినిమాలతో బోల్తా పడ్డాడు. ఆ మధ్య గోదావరి, గోల్కొండ హై స్కూల్ చిత్రాలతో ఆకట్టుకున్నప్పటికీ మళ్లీ నరుడా డోనరుడాతో నిరాశపరిచాడు. అయితే మళ్లీ మళ్లీ రావాతో మెప్పించి ఇప్పుడు వరుసగా ప్రాజెక్టులతో బిజీ అయిపోయాడు.

ప్రస్తుతం సుమంత్ రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. దాదాపు అవి షూటింగ్ దశకు చేరుకున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా సుమంతే వివరించాడు. ఇక ప్రయోగాల జోలికి పోకుండా సాఫ్ట్ కథలతోనే ముందుకు వెళ్లాలని తాను నిర్ణయించుకున్నట్లు సుమంత్ చెబుతున్నాడు.

గతంలో మాస్ క్యారెక్టర్ అంటూ ప్రయోగాలు చేశా. కానీ, అవి బోల్తా పడ్డాయి. అవి నా బాడీ లాంగ్వేజ్ కు సూట్ కావని ఆలస్యంగా అర్థమైంది. అందుకే ఇకపై అలాంటి కథల జోలికి పోను అని ఈ అక్కినేని నట వారసుడు చెబుతున్నాడు. ప్రస్తుతం రిలీజ్ కు రెడీగా ఉన్న రెండింటిలో ఓ థ్రిల్లర్ డ్రామా కూడా ఉందని.. సమ్మర్ కు అది విడుదల అవుతుందన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles