Shankar Not Happy with 2.0 VFX Works | గ్రాఫిక్స్ పై శంకర్ అసంతృప్తి.. ఇంకా ఆలస్యం?

Another delay for 2 o

2.0, 2.0 Release Date, Director Shankar, Rajinikanth, Lyca Productions, 2.0 Irritate, Robo 2.O release Date

Shankar unhappy with Rajinikanth, Akshay starrer 2.0, another delay on the cards. Sources inform that the VFX on the film is still taking time and director Shankar is not happy with the outcome.

2.O రిలీజ్ మరింత ఆలస్యం?

Posted: 01/29/2018 07:04 PM IST
Another delay for 2 o

రజనీకాంత్ .. అక్షయ్ కుమార్ .. ఎమీ జాక్సన్ ప్రధాన పాత్రలుగా శంకర్ '2.0' సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాను ఏప్రిల్ 13వ తేదీన విడుదల చేయనున్నట్టు చెప్పారు. అయితే అప్పటికి పనులు ఇంకా పూర్తి కావనేది తాజా సమాచారం.

ఈ సినిమాలో గ్రాఫిక్స్ కి అత్యధిక ప్రాధాన్యత వుంది. అందువలన మరింత సమయం పడుతుందని, దీంతో ఏప్రిల్ 27వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే శంకర్ మాత్రం .. పూర్తి స్థాయి అవుట్ పుట్ తనకి సంతృప్తికరంగా అనిపించిన తరువాతనే రిలీజ్ కి ఓకే చెబుతానని అంటున్నారట. అందువలన ఈ సినిమా విడుదల మరింత ఆలస్యం కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో జరుగుతోన్న ఊగిసలాట, అభిమానులతోపాటు ఇతర సినిమాల దర్శక నిర్మాతలకు చికాకు తెప్పిస్తోంది . గతేడాది దీపావళి మొదలు.. రిపబ్లిక్ డే... ఇలా వరుసగా కొన్ని చిత్రాలు తమ రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకున్నాయి. శంకర్ తాజా నిర్ణయం నేపథ్యంలో మరోసారి వారంతా తీవ్రమైన అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles