Charan Next May Delay due to Director | బోయపాటి కారణంగా చెర్రీ ఆలస్యం.. కారణం అదేనంట!

Rc 12 shoot may delay

Ram Charan, Boyapati Srinu, RC 12, Regular Shooting, Kaira Advani, Boyapati Ram Charan Movie Cast

Ram Charan Boyapati Srinu Movie may delay for Casting Problem. Boyapati plans perfect Casting for Cherry Family Action Drama.

చెర్రీ-బోయపాటి... కాస్త ఆలస్యంగానే

Posted: 01/23/2018 07:27 PM IST
Rc 12 shoot may delay

రంగస్థలం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీనుతో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ముహుర్తం షాట్ కొట్టించుకుని, స్క్రిప్ట్ పనులు పూర్తి చేసిన ఈ యాక్షన్ దర్శకుడు చెర్రీ కోసం వెయిట్ చేస్తున్నాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే.. రెగ్యులర్ షూటింగ్ కాస్త ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.

చిత్రంలో కైరా అద్వానీని హీరోయిన్ గా ఎంపిక చేయగా.. మిగతా నటులుగా తమిళ నటుడు ప్రశాంత్, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్, నటి స్నేహా తదితరులను తీసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎప్పటిలాగే తన సినిమాలో నటీనటులు ఎక్కువ మంది ఉండేలా చూసుకునే బోయపాటి చెర్రీ కోసం కూడా అదే ఫార్ములాను ఉపయోగించబోతున్నాడు.

భారీ కాస్టింగ్ తో ఓ ఫ్యామిలీ సెంటిమెంట్ కమ్ యాక్షన్ డ్రామాను తీయబోతున్నాడు. మున్ముందు ఈ కాస్టింగ్ లో మరికొందరు సీనియర్లు కూడా చేరే అవకాశం ఉందని సంకేతాలు అందించాడు కూడా. వారందరినీ ఎంపిక చేశాకే చిత్ర షూటింగ్ ను షురూ చేయాలని.. ఈ లోపు చెర్రీకి కూడా లుక్కు మార్చుకునేందుకు వీలు కలుగుతుందని బోయపాటి ఆలోచనలో ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles