Mega Hero Next Space thriller | ఘాజీ డైరెక్టర్ తో మెగా హీరో.. ఈసారి కూడా కొత్త జోనరే!

Varun tej next space thriller

Varun Tej, Ghazi Movie, Director Sankalp Reddy, Space Thriller, Varun Tej Space Thriller, Varun Tej Next, Varun Tej 2018 Movies, Sankalp Reddy Second Movie

Tej. Director Sankalp who won great appreciation from all quarters for his debut movie ‘Ghazi’ is going to make another different film. This time he has chosen space as subject.Varun Tej, who is celebrating his birthday today, told the media that he is excited to work with Sankalp. “The story is quite novel for an Indian movie. It requires me to do lot of physical training to do gravitational stuff. I will go for special training either in USA or Bangkok from April. Later we will commence the shoot,” he said.

స్పేస్ థ్రిల్లర్ లో వరుణ్ తేజ్

Posted: 01/20/2018 03:31 PM IST
Varun tej next space thriller

షార్ట్ ఫిలింస్ తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్సించిన సంకల్ప్ రెడ్డి ద ఘాజీ ఎటాక్ తో ఒక్కసారిగా సెన్సేషన్ అయిపోయాడు. చరిత్రలో కనుమరుగు అయిపోయిన అంశాన్ని అంతే అద్భుతంగా తెరకెక్కించి మూడు భాషల్లోనూ హిట్ అందుకున్నాడు ఈ హైదరాబాదీ. ఇండస్ట్రీలో అనుభవం లేకపోయినా సాంకేతికతను తక్కువ బడ్జెట్ లో అతను ప్రజెంట్ చేసిన తీరు ఔరా అనిపించింది. ఈ నేపథ్యంలో అతని రెండో చిత్రంపై ఇప్పుడు ఓ వార్త వినిపిస్తోంది.

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా అతను తన కొత్త సినిమా మొదలుపెడుతున్నాడంట. ఇండియన్ సినిమాలో అత్యంత అరుదైన స్పేస్ బ్యాక్ డ్రాప్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడని తెలుస్తోంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. కేవలం 25 కోట్లతోనే అత్యంత రిచ్ గా ఈ చిత్రాన్ని తీయబోతున్నాడు. సినిమాలో క్యారెక్టర్ కోసం దర్శకుడు ఇటీవల చాలా సేపు వరుణ్ తో చర్చలు జరిపాడు. అంతే కాకుండా స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకోవాలని కూడా చెప్పాడట. దీంతో మెగా హీరో బ్యాంకాక్ గాని లేక అమెరికా గాని పయనమవ్వనున్నాడని సమాచారం అందుతోంది.

తొలి సినిమా ‘ఘాజీ’ తరహాలోనే ఇది కూడా వైవిధ్యమైన కథతో తెరకెక్కబోయే ప్రయోగాత్మక చిత్రమే. ఇప్పటికే టిక్ టిక్ టిక్ పేరుతో తమిళ్ లో జయం రవి హీరోగా ఓ చిత్రం వస్తన్న విషయం తెలిసిందే. ఈ జోనర్ లో ఇదే రెండో చిత్రంగా భావించవచ్చు. తొలి సినిమా తరహాలోనే పక్కా ప్లానింగ్ తో రెండో చిత్రాన్ని కూడా తెరెక్కించేందుకు ప్రణాళికలు రచించినట్లు స్పష్టమౌతోంది. ఏప్రిల్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. అయితే తన చిత్రాల విషయంలో తాను చెప్పేదాకా వెయిట్ చేయాలంటూ వరుణ్ విజ్నప్తి చేసిన నేపథ్యంలో అప్పటిదాకా ఆగితే బావుంటుందేమో!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles