Kollywood Senior Actor Re Entry with RC 12 | రామ్ చరణ్ మూవీతో రీ-ఎంట్రీ..

Senior actor prashanth in rc 12

Ram Charan, Boyapati Srinu, Vivek Oberoi, Devi Sri Prasad, RC12, Prashanth Ram Charan Movie, Prashanth Re Entry

Tollywood actor Ram Charan has commenced work on his next project with director Boyapati Srinu. The shooting of the film began on Friday in Hyderabad. ... Kollywood actor Prashanth and Bollywood actor Vivek Oberoi have been roped in for key roles. Devi Sri Prasad will be scoring the film's music.

చెర్రీలో మూవీలో సీనియర్ నటుడు ప్రశాంత్

Posted: 01/19/2018 05:55 PM IST
Senior actor prashanth in rc 12

రామ్ చరణ్ - బోయపాటి కాంబినేషన్లోని సినిమా ఈ రోజు ఉదయమే ప్రారంభమైంది. ఈ రోజు నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో విలన్ గా వివేక్ ఒబెరాయ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక , స్నేహ ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో.. తమిళ సీనియర్ హీరో ప్రశాంత్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్టుగా సమాచారం.

గతంలో 'జీన్స్' .. 'దొంగ దొంగ' సినిమాల ద్వారా ప్రశాంత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆ తరువాత ఆయన సినిమాలను తగ్గిస్తూ వచ్చారు. తెలుగులో ఆయన చేసే పాత్ర ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. చరణ్ .. బోయపాటి సినిమాలో భారీ తారాగణం వచ్చి చేరుతుండటం, అందరిలో ఆసక్తిని పెంచుతూ వెళుతోంది.

దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. దీపావళికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles