Upendra breaks down at Kashinath Dead Body | గురువు పార్థివ దేహాన్ని చూసి ఎమోషనల్ అయి ఏడ్చేసిన ఉప్పీ

Kannada director kashinath passes away

Kashinath, Kashinath Dies, Sandalwood, Actor Upendra, Kashinath Kannada, Kashinath Passes Away, Kashinath Sandalwood Mourn, Upendra Cry Kashinath Dead Body

Kashinath death Actor Upendra breaks down while talking about his guru. Upendra was in a state of a shock when he heard about the death of Kashinath."I don't know what to say. We just have his memories now. I did not even know that he was hospitalised and had health issues. I was in a state of shock when I heard the news in the morning. He thought me the 'ABCD' of filmmaking and O never imagined that he would leave us so early," Upendra said.

కాశీనాథ్ కన్నుమూత.. కంటతడి పెట్టిన ఉపేంద్ర

Posted: 01/18/2018 06:29 PM IST
Kannada director kashinath passes away

సీనియర్ నటుడు, దర్శకుడు కాశీనాథ్(65) మరణంతో శాండల్ వుడ్ శోక సంద్రంలో నిండిపోయింది. కేన్సర్ తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శంకర్ ఆస్పత్రిలో గురువారం కన్నుమూశారు. శృంగారం, హాస్యం మేళవించిన చిత్రాలతో 80, 90 దశకంలో ఆయన పిచ్చ క్రేజ్ సంపాదించుకున్నారు.

అపురూపద అతిధిగలు చిత్రం ద్వారా 1976లో సినిమాల్లోకి ప్రవేశించిన కాశీనాథ్ నటించినవి కేవలం 45 సినిమాలే. అందులో ఆయన దర్శకత్వం వహించినవే ఎక్కువగా ఉంటాయి. పెద్దగా అందం లేకపోవటంతో తన రూపానికి కామెడీనే కరెక్ట్ అని ఫిక్సయిపోయి.. ఆ టేకింగ్ తో మంచి పేరు తెచ్చుకున్నారు. అంతేందుకు మళయాళంలో పెద్ద హీరోల సినిమాలకు పోటీగా ఈయన డబ్బింగ్ సినిమాలు వసూళ్లు తెచ్చేవి. అయితే తర్వాత రూటు మార్చి దర్శకుడిగా మారి.. మధ్య మధ్యలో నటిస్తూ మంచి చిత్రాలతో ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. కథ నచ్చితే తప్ప సినిమా చేయటం ఆయనకు అలవాటు లేదు.

ఇక గత ఐదారేళ్ళ నుంచి చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న కాశీనాథ్ ప్రస్తుతం ఒకే ఒక్క సినిమా చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు. ఆయన నటించిన చివరి చిత్రం చౌకా. ఓ అతిథి పాత్రలో ఆయన మెరిశాడు. కన్నడ స్టార్ హీరో దర్శన్ కూడా గెస్ట్ రోల్ నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అది ఒలు మున్సామీ కాశీనాథ్ నటించిన చివరి చిత్రం. అది త్వరలోనే విడుదల కానుంది. కాశీనాథ్ మరణం గురించి ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఉపేంద్ర గురువు...

వైవిధ్యభరితమైన చిత్రాలను ఎలా తెరకెక్కించాలో గురువు కాశీనాథ్ దగ్గరే సూపర్ స్టార్ ఉపేంద్ర నేర్చుకున్నాడు. నటుడిగా తన కెరీర్ తొలి అడుగులు కాశీనాథ్ దగ్గరే నేర్చుకున్న ఉప్పీ తర్వాత ష్ తో డైరెక్టర్ గా మారిపోయాడు. అందులో గురువు కాశీనాథ్ తో ఓ ముఖ్యపాత్ర కూడా చేయించాడు. పలు ఇంటర్వ్యూలో వీరిద్దరి తమ మధ్య అనుబంధం గురించి చెప్పుకున్నారు కూడా. అయితే అంత జబ్బు ఉన్నా మాటవరసకు కూడా తనకు చెప్పలేదని ఉపేంద్ర బాధపడ్డాడు. టీవిలో చూసాకే ఆయనకు కేన్సర్ ఉందన్న విషయం తనకు తెలిసిందని.. కాశీనాథ్ తనకు దైవం కన్నా ఎక్కువ అని ఉపేంద్ర కంటతడి పెట్టుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles